Priyanka Chopra : బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు బాలీవుడ్‌లో తెగ సందడి చేసిన ఈ అందాల ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలీవుడ్‌లో రచ్చ చేస్తుంది.ఈ అమ్మడు తన నటన, ముఖ్యంగా తన వ్యక్తిత్వంతో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 2018లో నిక్ జోనాస్‌తో వివాహం చేసుకున్న తర్వాత, ప్రియాంక లాస్ ఏంజిల్స్‌కు మకాం మార్చింది. ప్రస్తుతం ఈ జంట, వారి కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి నివసిస్తోంది. అయితే ప్రియాంక బాలీవుడ్ మూవీలో కనిపించి సుమారు మూడేళ్లు గడుస్తోంది. ఆమె చివరిగా 2021లో ది వైట్ టైగర్ అనే హిందీ సినిమాలో నటించింది.
ప్రస్తుతం కాలిఫోర్నియాలోనే సెటిలైన ఈ ముద్దుగుమ్మ అక్కడ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్‌లు కూడా చేస్తుంది. అప్పుడప్పుడు ప్రత్యేక పండుగ సందర్భంలో మాత్రం ప్రియాంక ఇండియాకి వస్తుంది. అయితే ప్రియాంక ఒకప్పుడు ముంబైలో పలు ఆస్తులు కొనుగోలు చేసింది . అయితే ఇప్పుడు వీటన్నింటిని అమ్మకానికి పెట్టేసిందని బాలీవుడ్ మీడియా సర్కిళ్లలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. గత ఏడాది తన పేరిట ఉన్న కొన్ని ఆస్తులని విక్రయించిన ఈ గ్లోబల్ భామ ప్రస్తుతం మరో రెండు పెంట్ హౌజ్‌లు కూడా అమ్మేసినట్టు సమాచారం. దీపావళి వేడుకల కోసం ప్రియాంక ముంబైకి రాగా, ఆ సమయంలో ముంబైలోని అంధేరిలో ఉన్న రెండు పెంట్‌హౌస్‌లను ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ చౌబేకి విక్రయించినట్టు ప్రచారం జరుగుతుంది.
ముంబైలోని పోష్ ఏరియా అయిన అంధేరీ శివారులో ఉన్న రెండు అపార్ట్‌మెంట్ పెంట్‌హౌస్‌లను.. దర్శకుడు, నిర్మాత & స్క్రీన్ రైటర్ అభిషేక్ చౌబేకి రూ. 6 కోట్లకు విక్రయించింది. రెండు ఫ్లాట్ల మొత్తం విస్తీర్ణం 2,292 చదరపు అడుగులు కాగా,ఈ సేల్ డీల్ అక్టోబర్ నెలలో జరిగింది. లోఖండ్‌వాలాలోని కరణ్ అపార్ట్‌మెంట్ టవర్‌లో, 9వ అంతస్తులో ఉన్న ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అమ్మకాలను ప్రియాంక తల్లి మధు చోప్రా చూసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 23, 25 తేదీల్లో వాలాదేవీలు జరిగాయి. ఫ్లాట్లను కొన్న చౌబే, మొత్తం స్టాంప్ డ్యూటీ ఛార్జీలుగా రూ. 36 లక్షలు చెల్లించారు. ఓషివారాలోని ఓ పెంట్‌హౌస్‌ను రూ.2.25 కోట్లకు, రెండో పెంట్‌హౌస్‌ను రూ.3.75 కోట్లకు విక్రయించారు.ఈ రెండు ఆస్తుల విక్రయానికి గానూ సుమారు 36 లక్షల రూపాయల స్టాంపు డ్యూటీ చెల్లించింది ప్రియాంక. అక్టోబర్ 23, 25 తేదీల్లో ఈ లావాదేవీలు జరిగినట్టు సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…