వినోదం

Prabhas On Salaar Success : డార్లింగ్స్ అంటూ తొలిసారి స‌లార్ సక్సెస్‌పై క్రేజీ రియాక్ష‌న్ ఇచ్చిన ప్ర‌భాస్

Prabhas On Salaar Success : బాహుబలి 1,2 చిత్రాల‌తో ఎంతో పెద్ద విజయాల‌ని త‌న ఖాతాలో వేసుకున్న ప్ర‌భాస్ ఆ త‌ర్వాత సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాల‌తో డిజాస్ట‌ర్స్ చ‌విచూశాడు. వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత స‌లార్ రూపంలో ప్ర‌భాస్‌కి అతి పెద్ద స‌క్సెస్ వ‌చ్చింది. మొత్తానికి రెబల్ స్టార్ ప్రభాస్ 2023ని ఘనంగా ముగించాడు అనే చెప్పాలి. బాహుబలి తర్వాత ఊరిస్తూ వస్తున్న విజయం సలార్ తో దక్క‌డంతో అభిమానులు మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ఆ అంచానాలు అన్నీ కూడా సలార్ తో నిలబడ్డాయి.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఎలాంటి సినిమా కావాలని అనుకుంటున్నారో అలాంటి వినోదం పంచింది. డార్లింగ్ కటౌట్ కు కరెక్ట్ సినిమా ఇది అంటున్నారు ఫ్యాన్స్. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న సలార్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. కల్కి 2898ఎడి అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నాడు అశ్విన్. మ‌రోవైపు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో కూడా ప్ర‌భాస్ ఓ చిత్రం చేస్తుండ‌గా, ఈ రెండు చిత్రాలు కూడా 2024లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సంద‌డి చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

Prabhas On Salaar Success

అయితే స‌లార్ స‌క్సెస్ త‌ర్వాత మూవీ టీం అంద‌రు కూడా త‌మ అభిప్రాయాల‌ని పంచుకున్నారు. ప్ర‌భాస్ మాత్రం స్పందించింది లేదు. ఎట్ట‌కేల‌కు న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో స‌లార్ మూవీలోని పోస్ట‌ర్ షేర్ చేస్తూ.. నేను ఖాన్సార్ భవిష్య‌త్తేంటో తేల్చే లోపు మీరు హాయిగా న్యూ ఇయ‌ర్ ఎంజాయ్ చేయండి డార్లింగ్స్‌.. స‌లార్ సీజ్‌ఫైర్‌ను మీ సినిమాగా భావించి పెద్ద స‌క్సెస్ అందించినందుకు థ్యాంక్యూ అని కామెంట్ పెట్టాడు. ప్ర‌భాస్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇక స‌లార్ చిత్రం తొలి రోజే ప్ర‌పంచవ్యాప్తంగా రూ.178.7 కోట్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించగా, ఈ మూవీ షారూఖ్ డంకీ మూవీని కూడా త‌ట్టుకొని 10 రోజుల్లో రూ.500 కోట్ల మార్క్ అందుకుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM