Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 2002 లో ‘ఈశ్వర్’ సినిమాతో ఇతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నెగిటివ్ రోల్స్ చేసే కొల్లా అశోక్ కుమార్ ఈ చిత్రంలో విలన్ గా నటించి మెప్పించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయమే సాధించింది. ఈ చిత్రం ఇచ్చిన విజయంతో మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కెరీర్ పరంగా దూసుకుపోతున్నా కూడా పెళ్లి విషయంలో అశ్రద్ధ చేస్తున్నారు. ఇతని కన్నా చిన్న వాళ్లు పెళ్లి చేసుకొని పిల్లలని కూడా కన్నారు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ పెళ్లికి సంబంధించి నిత్యం ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తుంటాయి. గతంలో అనుష్కతో పెళ్లి అని లేదంటే ఆయన ఊరులో ఎవరో చుట్టాల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారాలు సాగాయి. వీటన్నింటికి పలు సందర్భాలలో ప్రభాస్ చెక్ పెట్టారు. ఇక ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ రిలీజ్ రోజు నుంచి మొదలైన ప్రభాస్, కృతి లవ్ రూమర్ ముదిరి పాకాన పడినటైంది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకుని ఎక్స్ ట్రా ట్వీట్లు చేసే ఉమైర్ సంధు కారణంగానే మాల్ధీవుల్లో వీరి ఎంగేజ్ మెంట్ అనే న్యూస్ బయటికొచ్చింది.

వచ్చే వారంలోనే ప్రభాస్ కృతి నిశ్చితార్థం అని ఉమైర్ ట్వీట్ చేయడంతో ప్రభాస్‌కి దీని గురించి తరచు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అయితే ప్రభాస్ దీనిపై స్పందించకపోయిన కూడా కృతిసనన్ మాత్రం సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూనే ఉంటుంది. ఇక ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అంటే అందులో అతని కష్టం కూడా ఉంది. అది గుర్తించే బాలీవుడ్ నిర్మాతలు సైతం ప్రభాస్ తో రూ.500 కోట్ల బడ్జెట్ తో సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె వంటి భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.