Pallavi Prashanth Prize Money : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో ఎట్టకేలకి ముగిసింది. 19మంది కంటెస్టెంట్స్‌తో సందడిగా సాగిన బిగ్ బాస్ షో కార్యక్రమంలో విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఫైనల్ కి చేరిన 6 గురిలో అత్యధిక ఓట్లు సాధించిన ప్రల్లవి ప్రశాంత్ కే బిగ్ బాస్ 7 కిరీటం దక్కింది. రైతు బిడ్డకే ప్రజలు పట్టం కట్టారు. శివాజీ, అమర్ గట్టి పోటీ ఇవ్వగా చివరకు విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడంతో అతడికి 35లక్షల నగదుతో పాటు మారుతి కారు, 15 లక్షల విలువైన బంగారం దక్కనుంది. యావర్ 15 లక్షలు తీసుకోవడంతో ప్రశాంత్ ప్రైజ్ మనీలో రూ.15లక్షలు తగ్గాయి.
అయితే యావర్ రూ.15లక్షలు తీసుకున్నా కూడా ప్రశాంత్‌కి ప్రైజ్ మనీ రూ. 35 లక్షలు రావడం అలానే, జోయాలుకాస్ వారు ఇచ్చే నగల విలువ రూ. 15 లక్షలు, బ్రీజా కారు విలువ సుమారు రూ. 12 లక్షలు ఉంటుందని తెలుస్తుండగా, మొత్తంగా పల్లవి ప్రశాంత్‌కు వచ్చింది రూ. 62 లక్షలు.అయితే ఇందులో ప్రైజ్ మనీని తాను ముందుగా చెప్పినట్టు రైతులకి సాయంగా అందిస్తానని కారుని తన తండ్రికి, గోల్డ్ ని తన తల్లికి అందించబోతున్నట్టు వేదికమీదే చెప్పారు ప్రశాంత్. ఆయన చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక ప్రశాంత్‌కి రైతు బిడ్డ అనే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అందుకు తగ్గట్లుగానే ప్రశాంత్ హౌస్ లో మాట్లాడుతూ వచ్చాడు. దీనితో ఆడియన్స్ రైతు బిడ్డకి ఓట్లు గుద్దేశారు. మొత్తంగా పల్లవి ప్రశాంత్ సైలెంట్ గా వచ్చి బిగ్ బాస్ 7 టైటిల్ ఎగరేసుకుపోయాడు.
అయితే బిగ్ బాస్ రియాలిటీ షో సెలెబ్రిటీలు బయటకి వస్తే దాడి చేసేంతగా మారింది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్, మరియు రన్నర్ గా అమర్ దీప్ నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య హౌస్ లో తార స్థాయికి చేరిన గొడవలు జరగడడంతో అది మనసులో పెట్టుకున్న పల్లవి ప్రశాంత్ ఫేక్ ఫ్యాన్స్ అమర్ దీప్‌ని అతని ఫ్యామిలీని తరిమితరిమి కొట్టారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. వందలాది మంది అల్లరి మూకల గుంపు అతని కారుపై ఒక్కసారిగా దాడి చేసింది. దాదాపు అరగంట పాటు.. కారులోనే ఉండిపోయిన అమర్ దీప్‌ని అతని ఫ్యామిలీని వెంటాడి వేటాడినట్టుగా దాడి చేసి.. వాళ్లని భయభ్రాంతుల్ని చేశారు. కారులో అమర్ దీప్ తల్లి.. అతని భార్య.. స్నేహితుడు నరేష్ లొల్ల.. డ్రైవర్ ఈ నలుగురూ ఉండగా, ఆ సమయంలో వారు ప్రాణాలని అరచేతిలో పెట్టుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…