OTT Releases This Week : కొత్త సంవత్సరంలో సరికొత్త సినిమాలు ప్రేక్షకులని అలరించేందుకు థియేటర్‌లోకి వచ్చేశాయి. ఈ వారం ‘సర్కారు నౌకరి’, ‘రాఘవ రెడ్డి’ థియేటర్స్ లో విడుదలయ్యాయ. మరోవైపు ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. నెట్‍ఫ్లిక్స్ లో చూస్తే ముందుగా నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన హాయ్ నాన్నచిత్రంపై అందరి దృష్టి ఉంది. జనవరి 4వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. హాయ్ నాన్న థియేటర్లలో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు జనవరి 4న నెట్‍ఫ్లిక్స్ లో సందడి చేయనుంది.
ఇక తమిళ హారర్ మూవీ కన్‍జ్యూరింగ్ కన్నప్పన్.. జనవరి 5న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఫూల్ మీ వన్స్ – సినిమా – నెట్‍ఫ్లిక్స్ – జనవరి 5, గుడ్ గ్రీఫ్ – సినిమా – నెట్‍ఫ్లిక్స్ – జనవరి 5, మ్యాన్ ఆన్ ది రన్ – డాక్యుమెంటరీ ఫిల్మ్ – నెట్‍ఫ్లిక్స్ – జనవరి 5, సొసైటీ ఆఫ్ ది స్నో – సినిమా- నెట్‍ఫ్లిక్స్ – జనవరి 4 నుండి స్ట్రీమింగ్ కానుంది.అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూస్తే.. ఫోయి – సినిమా – అమెజాన్ ప్రైమ్ వీడియో – జనవరి 5 నుండి స్ట్రీమింగ్ కానుండగా, జేమ్స్ మే: ఔర్ మ్యాన్ ఇన్ ఇండియా – సిరీస్ – అమెజాన్ ప్రైమ్ వీడియో – జనవరి 5 నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
ఆహాలో స్టూడెంట్స్ కామెడీ థ్రిల్లర్ ‘బాయ్స్ హాస్టల్’ సినిమా జనవరి 5వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఆహాలో కూడా అడుగుపెట్టనుంది. ఇక డిస్నీ+ హాట్‍స్టార్ లో పెరిల్లూర్ ప్రీమియల్ లీగ్ – మలయాళ సినిమా – డిస్నీ+ హాట్‍స్టార్ – జనవరి 5 (తెలుగు వెర్షన్ కూడా), క్యుబికల్స్ సీజన్ 3 – వెబ్ సిరీస్ – సోనీ లివ్ – జనవరి 5 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈటీవీ విన్ లో నైంటీస్ (90s) వెబ్ సిరీస్ కూడా జనవరి 5వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. 1990ల్లో మధ్య తరగతి కుటుంబం చుట్టూ ఈ సిరీస్ ఉంటుంది. సీనియర్ నటుడు, ఇటీవలే బిగ్‍బాస్ షో ఆడిన శివాజీ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. అలానే జీ5 లో బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన తేజస్ సినిమా జనవరి 5వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…