OTT Releases This Week : ప్రతి వారం ఓటీటీలో ప్రేక్షకులకి పసందైన వినోదం దక్కుతుంది.ఈ వారం థియేటర్లలో ‘సలార్’, ‘డంకీ’, ‘ఆక్వామెన్’ వంటి భారీ సినిమాలు రిలీజ్ అవుతుండగా, , ఓటీటీల్లోనూ పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి రెడీ అవుతున్నాయి. మరి ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయో చూస్తే…నెట్‌ఫ్లిక్స్‌లో ది రోప్ కర్స్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 17 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. మేస్ట్రో (హాలీవుడ్) డిసెంబరు 20 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆది కేశవ (తెలుగు) డిసెంబరు 22, టాప్‌గన్: మావెరిక్ (హాలీవుడ్) డిసెంబరు 22, కర్రీ అండ్ సైనైడ్ (డాక్యుమెంటరీ) డిసెంబరు 22, రెబల్ మూన్ (హాలీవుడ్) డిసెంబరు 22 నుండి స్ట్రీమింగ్ కానున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో లో సప్తసాగర దాచె ఎల్లో సైడ్ బీ అనే చిత్రం డిసెంబర్ 22న ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుంది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వంసత్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక ఫ్లేమ్స్ సీజన్ 4 – వెబ్ సిరీస్ – డిసెంబర్ 21 – అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇక డ్రై డే – సినిమా – డిసెంబర్ 22 – అమెజాన్ ప్రైమ్ వీడియో, సాల్ట్ బర్న్ – సినిమా – డిసెంబర్ 22 – అమెజాన్ ప్రైమ్ వీడియో కానుండగా, మిషన్ స్టార్ట్ ఏబీ: కాంపిటేటివ్ రియాలిటీ సిరీస్ – డిసెంబర్ 19 – అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక జియో సినిమాలో బార్చీ చిత్రం డిసెంబర్ 21న స్ట్రీమింగ్ కానుంది. హాలీవుడ్‍లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఈ మూవీ నిలిచింది.

డిస్నీ+ హాట్‍స్టార్ లో చూస్తే.. బీటీఎస్ మాన్యుమెంట్స్: బియాండ్ ది స్టార్స్ – డాక్యుసిరీస్ – డిసెంబర్ 20 – డిస్నీ+ హాట్‍స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలానే పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ – సిరీస్ – డిసెంబర్ 20 – డిస్నీ+ హాట్‍స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక వాట్ ఇఫ్ సీజన్ 2- వెబ్ సిరీస్ – డిసెంబర్ 22 – డిస్నీ+ హాట్‍స్టార్, హ్యూమరస్లీ యువర్స్ సీజన్ 3 – సిరీస్ – డిసెంబర్ 22 – జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇక మరోవైపు ఈటీవీ విన్ ఓటీటీలో మంచు మనోజ్ హోస్ట్ చేస్తున్న ఉస్తాద్ గేమ్ షో రెండో ఎపిసోడ్ డిసెంబర్ 21న స్ట్రీమింగ్‍కు రానుంది. ఇందులో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గెస్టుగా వచ్చి సందడి చేయనున్నారు.