వినోదం

OTT Release this Week : ఈ వారం ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్న మూవీలు, సిరీస్‌లు ఇవే..!

OTT Release this Week : ప్ర‌తి వారం ఓటీటీలో వైవిధ్య‌మైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప‌ల‌క‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటివి డిఫ‌రెంట్ కంటెంట్ ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో నాగ చైత‌న్య డెబ్యూ వెబ్ సిరీస్ ధూత‌తో పాటు సంపూర్ణేశ్ బాబు ‘మార్టిన్ లూథర్ కింగ్’, సిద్ధార్థ్ ‘చిన్నా’ సహా మరిన్ని చిత్రాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

సిద్ధార్థ్ హీరోగా నటించిన చిత్తా (తెలుగులో చిన్నా) సినిమా నవంబర్ 28వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రం సంద‌డి చేయ‌నుంది. ఇక ఇండియానా జోన్స్ అండ్ డయల్ ది డెస్టినీ – డిస్నీ+ హాట్‍స్టార్ – డిసెంబర్ 1న స్ట్రీమింగ్ కానుండ‌గా, మాన్‍స్టర్ ఇన్‍సైడ్ – డిస్నీ+ హాట్‍స్టార్ – డిసెంబర్ 1, ది షెఫర్డ్ – డిస్నీ+ హాట్‍స్టార్ – డిసెంబర్ 1న స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో నాగ చైతన్య వెబ్ సిరీస్.. ‘ధూత’ డిసెంబర్ 1వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ కి విక్రమ్ కే కుమార్ సిరీస్‍కు దర్శకత్వం వహించారు.

OTT Release this Week

షెహర్ లక్హోత్ – అమెజాన్ ప్రైమ్ వీడియో – నవంబర్ 30 నుండి స్ట్రీమింగ్ కానుండ‌గా, క్యాండీ కేన్ లేన్ – అమెజాన్ ప్రైమ్ వీడియో – డిసెంబర్ 1న స్ట్రీమ్ కానుంది. నెట్‍ఫ్లిక్స్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన మిషన్ రాణిగంజ్ సినిమా డిసెంబర్ 1వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍ కానుంది. అమెరికన్ సింఫనీ – నెట్‍ఫ్లిక్స్ – నవంబర్ 29 నుండి స్ట్రీమ్ కానుండ‌గా, బ్యాడ్ సర్జన్ – నెట్‍ఫ్లిక్స్ – నవంబర్ 29, ఫ్యామిలీ స్విచ్ – నెట్‍ఫ్లిక్స్ – నవంబర్ 29, హార్డ్ డేస్ – నెట్‍ఫ్లిక్స్ – నవంబర్ 30, ఓబ్లిటిరేడెడ్ – నెట్‍ఫ్లిక్స్ – నవంబర్ 30, మే డిసెంబర్ – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది. సోనీ లివ్ లో సంపూర్ణేశ్ బాబు హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా నవంబర్ 29వ తేదీన సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇక శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘800’ సినిమా జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో డిసెంబర్ 2వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM