వినోదం

Nithin : త్రిష‌కు మ‌ద్దతుగా నిలిచిన నితిన్‌.. ఆ న‌టుడిపై ఆగ్ర‌హం..!

Nithin : మొన్న‌టి వ‌ర‌కు ర‌ష్మిక మార్ఫింగ్ వీడియో సినీ ఇండ‌స్ట్రీలో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మార‌గా, ఇప్పుడు త్రిష వ్య‌వ‌హ‌రం హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్ద‌రికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల నుండి పెద్ద ఎత్తున స‌పోర్ట్ ల‌భించింది. విలన్ పాత్ర‌లు చేస్తూ అంద‌రిని మెప్పిస్తున్న‌ నటుడు మన్సూర్ అలీఖాన్ రీసెంట్‌గా న‌టి త్రిష‌పై రేప్ సీన్ గురించి కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. అవి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి. నేను చాలా సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను. ఆ సీన్స్‌లో నేను బాగా ఎంజాయ్ చేసేవాడిని. లియో సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు త్రిషతో కూడా నాకు రేప్ సీన్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ, ఆ సినిమాలో అలాంటి సీన్ లేదు అని బాధపడ్డాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మ‌న్సూర్ వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. దీనిపై త్రిష స్పందిస్తూ.. మహిళలని ద్వేషిస్తున్నట్టు ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళతో కలిసి నాకు సినిమాలో సీన్స్ లేనందుకు నేను ఎంత‌గానో సంతోషిస్తున్నాను. నా తర్వాత సినిమాల్లో కూడా ఇతనితో కలిసి నటించకుండా ఉండేలా చూసుకుంటాను అంటూ త్రిష త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొంది. ఇక ఇలాంటి కామెంట్స్ చేసిందుకు మ‌న్సూర్‌పై రోజా, ఖుష్బూ, లోకేష్ క‌న‌గ‌రాజ్ , కార్తీక్ సుబ్బరాజు, సింగ‌ర్స్ మాళవిక, చిన్మయి, న‌టుడు నితిన్‌.. ఇలా చాలామంది సెల‌బ్రిటీలు అత‌నిపై దుమ్మెత్తిపోస్తూ త్రిష‌కి అండ‌గా నిలిచారు.

Nithin

తాజాగా టాలీవుడ్ న‌టుడు నితిన్ కూడా త్రిష‌కి త‌న సపోర్ట్ అందించారు. త్రిషకి మద్దతుగా నితిన్ కామెంట్స్ చేస్తూ.. త్రిషపై మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలకు ఇండస్ట్రీలో చోటు లేదు అని చెప్పుకొచ్చారు. మహిళలకు వ్యతిరేకంగా చేసే ఇలాంటి వ్యాఖ్యలని ప్రతి ఒక్కరూ ఖండించాలి అంటూ నితిన్ త్రిష‌కి త‌న స‌పోర్ట్ అందించారు. కాగా నితిన్, త్రిష జంటగా గతంలో అల్లరి బుల్లోడు అనే చిత్రంలో నటించిన విష‌యం తెలిసిందే.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM