NBK : తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న టాక్ షోలలో అన్‌స్టాపబుల్ అనే షో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో ఈ షో సంచలనం సృష్టించినట్లు ఇటీవల ‘ఆహా’ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు అని తేడా లేకుండా దాదాపు అందరు హీరోలను కవర్ చేస్తోంది అన్‌స్టాపబుల్ షో. ఇటీవల బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో మూవీ టీమ్ అన్‌స్టాపబుల్ షోలో సందడి చేసింది.
ఇప్పటి వరకు ఈ షోలో సినీ నటులు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి కనిపించారు. ఇప్పుడు వీరికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తోడయ్యాడు. “నా సాయంత్రాన్ని ఎన్బీకే గారితో ‘అన్‌స్టాపబుల్’గా ఆనందించాను” అంటూ బాలయ్యతో దిగిన ఫొటో షేర్ చేస్తూ చెప్పుకొచ్చారు మహేష్ బాబు. ఈ షో అతి త్వరలోనే ప్రసారం కానున్నట్టు తెలుస్తుంది.
తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్‌లో భాగంగా బాలయ్య షోలో రాజమౌళి, కీరవాణి హాజరైనట్టు తెలుస్తుంది. వీటికి సంబంధించిన ఫొటోలు విడుదల చేసిన ఆహా టీం త్వరలోనే ప్రోమో రిలీజ్ చేయనుంది. షోలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాల్గొంటే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ హీరోలు కూడా షోలో పాల్గొంటే ఈ ఎపిసోడ్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం.
#MansionHouse @tnldoublehorse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustriesltd #CellPoint
— ahavideoin (@ahavideoIN) December 15, 2021