Muthu Re-release : ఇప్పుడు ఇప్పుడంతా 4కె రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయినా సినిమాలు, భారీ ప్రేక్షకాధరణ పొందిన సినిమాలను హీరోల పుట్టిన రోజులకు, అదేవిధంగా ఆయా సినిమాల యానివర్సరీలకు రీరిలీజ్ చేయడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికే చాలా హీరోల సినిమాలు రీరిలీజ్ జరుపుకొని పెద్ద ఎత్తున ప్రేక్షకులని అలరించాయి. ఇక ఈ నేపథ్యంలోడిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకొని ముత్తు చిత్రాన్ని డిసెంబర్ 2న గ్రాండ్ గా విడుదల చేసారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక నాలుగు ప్రాంతాల్లోని వేలాది థియేటర్లో బ్రహ్మాండంగా ముత్తు విడుదలైంది.
భారీ అంచనాలతో ముత్తు చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ముందు ప్రకటించగా, ఈ సినిమా రీరిలీజ్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి అసలు ఎలాంటి స్పందనా లేదు. టికెట్లు కూడా అంతగా అమ్ముడు కాకపోవడంతో కొన్ని షోలని కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో సంచలనాలు సృష్టించిన ముత్తు చిత్రం రీరిలీజ్‌లోను అదరగొడతారని అందరు అనుకున్నారు. కాని సీన్ రివర్స్ అయింది .అడ్వాన్స్ బుకింగ్స్ లో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోకపోవడంతో షోలను రద్దు చేయాలని థియేటర్లు యజమానులు నిర్ణయించారు. తమిళనాడులోనే కాకుండా తెలుగులోను ముత్తు చిత్రంకి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని ఎవరు ఊహించలేదు.
రజనీకాంత్ సూపర్ హిట్ చిత్రాలలో ముత్తు ఒకటి. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో 1995 లో విడుదలైన ముత్తులో రజనీకాంత్ సరసన మీనా హీరోయిన్‌గా నటించింది. ఎ. ఆర్. రెహమాన్ సంగీత సారథ్యంలో అద్భుతమైన పాటలు నేటికి శ్రోతలను, తలైవా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అక్టోబరు 23, 1995న విడుదలైన ఈ చిత్రం ఆనాడు సూపర్ హిట్ చిత్రంగా నిలవడమే కాకుండా బాక్స్ ఆఫీస్‌ను కలెక్షన్లతో షేక్ చేసింది. తమిళనాడులోని చాలా థియేటర్లలో 175 రోజులు ఆడి అందరిని ఆశ్చర్యంలో ముచ్చెత్తింది. మన దగ్గర సంచలనం సృష్టించిన ముత్తు 1998 లో జపనీస్ భాషలో విడుదలై సంచలన విజయం అందుకోవడమే కాకుండా దాదాపు 400 మిలియన్ యాన్లను రాబట్టింది. దాంతో రజనీకాంత్ జపాన్ లో కూడా వీరాభిమానులను సంపాదించుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…