Muralidharan 800 Movie OTT Release Date : లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ గురించి క్రికెట్ ప్రేమికులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఆయన జీవితం ఆధారం రూపొందిన సినిమా ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) విన్నర్ షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ రాశారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. శ్రీలంకలో సింహళ భాషలో విడుదలైంది. ఈ ఏడాది అక్టోబర్ 6న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలాయళం భాషలతో పాటు శ్రీలంకలో సింహళ భాషలో విడుదలైంది.
చిత్రంలో ముత్తయ్య మురళీధర్ పాత్రలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. అలాగే అతని భార్య పాత్రలో మహిమా నంబియార్ కనిపించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. ఇక ముత్తయ్య మురళీధర్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించగా.. ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ లభించింది. ఇక ఇప్పుడు ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమా తీసుకున్నట్లు తెలుస్తోంది.
వచ్చే నెల అంటే డిసెంబర్ 2 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని తెలియజేస్తూ జియో సినిమా ట్వీట్ చేసింది. అయితే థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమాకు ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. అయితే ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ మంది థియేటర్లకు రాలేదు. ఆ కారణంగా జియో ఓటీటీలో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. చిత్రంలో ‘అఖండ’, ‘స్కంద’ సినిమాల ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్ర చేశారు. మురళీధరన్ తన బాల్యంలో శ్రీలంకలో తమిళులపై జరిగిన దాడులు, క్రికెట్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎదురైన అవమానాలు వంటివి చూపించారు. చెన్నైకు చెందిన అమ్మాయిని మురళీధరన్ వివాహం చేసుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…