Mrunal Thakur : హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులని అలరించిన అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ భాషా సినిమాలలో వరసగా అవకాశాలు అందుకొంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ అందాల భామ సోషల్ మీడియాలో నిత్యం తన గ్లామర్‌తో తెగ ఆకట్టుకుంటుంది. అయితే ఇటీవల సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్న నేపథ్యంలో మృణాల్ ఒక వ్యక్తితో డేటింగ్ చేస్తుందని, త్వరలో అతనితో పెళ్లి జరగనుందంటూ ప్రచారం జరిగింది. దానిపై ఓ క్లారిటీ వచ్చింది. గత కొద్ది రోజుల క్రితం ఈమె తెలుగింటికి కోడలు కాబోతోంది అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ వార్తలపై స్పందించిన ఈమె ప్రస్తుతానికి తాను పెళ్లి చేసుకోవడం లేదు అంటూ ఓ క్లారిటీ ఇచ్చింది.
మృణాల్ ఠాకూర్- గాయకుడు బాద్షా ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. వీరిద్దరూ శిల్పాశెట్టితో కలిసి ఇటీవల దీపావళి పార్టీలో కనిపించారు. ఇక అక్కడ శిల్పా, బాద్‌షాతో కలిసి దిగిన ఒక ఫోటోని మృణాల్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. “ఇద్దరు ఫేవరెట్ వ్యక్తులు” అంటూ పేర్కొన్నారు. ఇక అదే పార్టీ నుంచి లీక్ అయిన ఒక వీడియోలో మృణాల్ అండ్ బాద్‌షా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కనిపించడంతో అందరి దృష్టిని వారిపై పడింది. ఇక అది డేటింగ్ రూమర్లకు దారితీసింది దీంతో పెద్ద ఎత్తున ఈ వీడియోను వైరల్ చేస్తూ ఈమె డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలను సృష్టించగా, దీనిపై క్లారిటీ ఇచ్చింది.
తమపై వచ్చే డేటింగ్ రూమర్స్‌కి బాద్ షా పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు. పేరు ప్రస్తావించకుండానే మీరు ఆలోచిస్తున్నట్టు ఏమీ లేదని తన ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు. “డియర్ ఇంటర్నెట్. మరోసారి నిరుత్సాహపరుస్తున్నందుకు.. సారీ. మీరు భావిస్తున్నట్టుగా ఏమీ లేదు అంటూ తన ఇన్‌స్టాలో రాసుకురావడంతో వీరిద్దరి మధ్య ఏమ లేదని అందరికి ఓ క్లారిటీ వచ్చింది. ఇక మృణాల్ ఇప్పుడు తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలో అదరగొడుతుంది. ప్రస్తుతం నాని సరసన ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో నటిస్తోంది. అప్పుడప్పుడు గ్లామర్‌తో కూడా నానా రచ్చ చేస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…