Most Watched Movie in OTT : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఆ మధ్య వరుస ఫ్లాపులతో చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన పని అయిపోయిందని, సినిమాలకి రిటైర్మెంట్ ప్రకటిస్తే బెటరని కొందరు సూచనలు చేశారు. కాని పడిలేచిన కెరటంలా షారూఖ్ ఖాన్ వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేసిన హీరోగా షారుఖ్ ఖాన్ సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది ప్రథమార్థంలో ‘పఠాన్’ తో కలెక్షన్ కోత కోసిన షారూఖ్ ఖాన్.. ద్వితియార్థంలో ‘జవాన్’ తో చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ‘జవాన్’ సినిమా కోట్లు కొల్లగొట్టింది. సుమారు రూ.1068 కోట్లకుపైగా వసూళ్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
సినీ చరిత్రలో అత్యధిక గ్రాస్ సాధించిన హిందీ సినిమా (ఒరిజినల్ లాంగ్వేజ్)గా కూడా ‘జవాన్’ రికార్డు సృష్టించడం విశేషం. ఈ సినిమా ఇప్పుడు తాజాగా మరో అరుదైన రికార్డు నమోదు చేసింది. నవంబర్ 2 న ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా పలు భాషల్లో బుల్లితెర ఆడియన్స్ ముందుకి వచ్చింది ఈ చిత్రం. ఇక అక్కడి నుండి డిజి టల్ రిలీజ్ పరంగా కూడా ఈ మూవీ మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటోంది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ రెండు వారాల్లో తమ ఓటిటి ప్లాట్ ఫామ్ లో అత్యధిక మంది వీక్షించిన మూవీగా జవాన్ రికార్డు క్రియేట్ చేసిందని తాజాగా నెట్ ఫ్లిక్స్ వారు అఫీషియల్ ప్రకటన చేశారు.
గతంలో ఆర్ఆర్ఆర్, గంగూభాయి కతీయవాడి, చోర్ నికల్ కె బాగా ఈ రికార్డు ని కలిగి ఉండగా, ఇప్పుడు దానిని జవాన్ బ్రేక్ చేసింది. నెట్ ఫ్లిక్స్ లో జవాన్ చిత్రం దూసుకెళ్తుండడంతో మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీలో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ పోషించగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గౌరి ఖాన్ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. సెప్టెంబర్ 7న థియేటర్లలో రిలీజైన జవాన్ సినిమా అన్ని భాషల్లోనూ మంచి హిట్ టాక్ సంపాదించింది. జవాన్ మూవీకి ఓటీటీలో 35 లక్షల వ్యూస్ రావడంతో షారూఖ్ ఆనందంతో ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు . ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ లో ఎక్కువ మంది చూసిన సినిమాగా జవాన్ నిలిచిందని చెప్పడానికి చాలా థ్రిల్ ఫీలవుతున్నాను అని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…