Mansur Ali Khan : తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ పేరు ఇటీవల వార్తలలో తెగ వినిపించింది. ‘లియో’ మూవీ గురించి మాట్లాడనన ఆయన ఆ సినిమాలో త్రిష నటిస్తున్నారని నాకు తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్న అయితే త్రిషతో నేను చేసే సన్నివేశాలలో ఒక్క సన్నివేశం అయినా బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని ముందుగా ఊహించాను. నా మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని ఎంతో ఆశించాను. కాని దర్శకుడు త్రిషని నాకు చూపించలేదు. గతంలో నేను ఎన్నో రేప్ సీన్స్ చేశాను. అవి నాకు కొత్త కాదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు మన్సూర్.ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. త్రిష కు మద్దతుగా చిరంజీవి, ఖుష్బూ, లోకేష్ కనగరాజ్, నటి మాళవిక మోహన్, చిన్మయి, హీరో నితిన్ తదితరులు ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
మన్సూర్ వ్యాఖ్యలపై త్రిష కూడా స్పందిస్తూ.. తన కెరీర్లో మిగతా సినిమాలలో అతను లేకుండా ఉండేలా చూసుకుంటానని, స్త్రీలను అగౌరవించే విధంగా, లైంగికంగా వేధించే విధంగా, అసహ్యంగా అతని మాటలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక త్రిష వ్యాఖ్యలకు మద్దతునిస్తూ చిరంజీవి, ఖుష్బూ వంటి పలువురు నటులు మన్సూర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నడిగర్ సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఆయన క్షమాపణ చెప్పాలని అన్నారు. కాని మన్సూర్ మాత్రం క్షమాపణలు చెప్పేదే లేదని తేల్చి చెప్పారు. అయితే, పరిస్థితి తీవ్రత నేపథ్యంలో త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ వివాదం అంతా ముగిసింది అనుకుంటున్న సమయంలో మరోసారి ఈ గొడవ కొత్త రూపం సంతరించుకుంది.
త్రిషకి క్షమాపణలు చెప్పిన తర్వాతి రోజు తనని అవమానించిన క్రమంలో త్రిషకు, ఖుష్బూ, చిరంజీవిలకు పరువునష్టం కింద నోటీసులు పంపిస్తున్నానంటూ మన్సూర్ కామెంట్ చేశారు. ఆయన చెప్పినట్టుగానే త్రిషకు, ఖుష్బూ, చిరంజీవిలపై శుక్రవారం మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన లాయర్ ధనంజయన్ ద్వారా కోటి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్‌లో కోరారు. ఇక ఈ పిటిషన్‌లో వీడియో మొత్తం చూడకుండా తన పరువుకు భంగం కలిగించారని మన్సూర్ అలీఖాన్ స్పష్టం చేశాడు. డిసెంబర్ 11న మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ ధర్మాసనం ముందుకి ఈ కేసు విచారణకు రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…