Manchu Lakshmi : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన శ్రియ శరన్ తెలుగు ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీల సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకుని సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోయింది. 2018 లో ఎవరికీ చెప్పకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో రష్యన్ స్పోర్ట్స్ మన్, బిజినెస్ మన్ అయిన ఆండ్రీ కోషివ్ ను సీక్రెట్ గా పెళ్ళి చేసుకుంది. అదే రీతిలో లేటెస్ట్ గా శ్రియ, ప్రేక్షకులకు మరో షాక్ ఇచ్చింది. గతేడాది తనకు బిడ్డ పుట్టిందని, తన పేరు రాధ అని శ్రియ తెలిపింది.
తొమ్మిది నెలల క్రితం తనకు ఆడపిల్ల పుట్టిందని అన్నారు. అయితే శ్రియ తల్లి అయిన విషయం తెలిసి అందరూ సంతోషించినప్పటికీ, జీవితంలో అత్యంత ముఖ్యమైన, సంతోషకరమైన విషయాన్ని ఎంతో రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రియకు బెస్ట్ ఫ్రెండ్ అయిన మంచు లక్ష్మీ కూడా ఈ విషయంపై స్పందించారు. ఆ హీరోయిన్ లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ కు రీ ట్వీట్ చేస్తూ.. ఇది ఎప్పటికీ గొప్ప శుభవార్త.. అంటూ శ్రియ దంపతులకు కంగ్రాట్స్ చెప్పింది.
గుడ్ న్యూస్ చెప్పావు శ్రియ. అత్యంత ఆనందకరమైన మాతృత్వాన్ని అనుభవించాలని కోరుకుంటున్నానంటూ తెలిపింది. ఆడ పిల్లకు జన్మనివ్వడం అనేది ఈ ప్రపంచంలోనే అతి గొప్ప విషయం. నీకు ఆ భగవంతుడు మరింత శక్తిని, ఆనందాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. అలాగే ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి నువ్వు తీసుకున్న సమయం విషయంలో నిన్ను చూసి గర్వపడుతున్నానని అన్నారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ, పిల్లలు అనేది పూర్తిగా నీ వ్యక్తిగత విషయం అని పేర్కొంది.