Mama Machindra OTT Release Date : ఈరోజుల్లో చాలామంది ఓటీటీ లోనే కొత్త సినిమాలు చూస్తున్నారు. థియేటర్లకి వెళ్లడం కూడా చాలామంది మానేశారు. ఓటీటీ లో ఎప్పుడు, ఏ సినిమా వస్తుందని ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఇక తాజాగా ఓటీటీ లో ఒక సినిమా రాబోతోంది. ఆ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. సుధీర్ బాబు హీరోగా మామా మశ్చీంద్ర సినిమా రాబోతోంది. థియేటర్లలో రిలీజైన మూడో రోజే సుధీర్ బాబు మామా మశ్చీంద్ర సినిమా ని అనౌన్స్ చేసేసారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు.
ఇక పూర్తి వివరాలను చూస్తే… అక్టోబర్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో మామా మశ్చీంద్ర స్ట్రీమింగ్ కాబోతోంది. కనీసం రెండు వారాలు కూడా గ్యాప్ లేకుండా మూవీ ని అనౌన్స్ చేసేసారు. మామా మశ్చీంద్ర మూవీ కి నెగెటివ్ టాక్ వచ్చింది. చిన్న సినిమాల భారీ పోటీ మధ్య ఈ మూవీ వచ్చింది. కానీ మంచి రెస్పాన్స్ అయితే రాలేదు. ఈ మూవీ లో సుధీర్‌బాబు త్రిబుల్ రోల్ లో నటించారు.
నటనకు ప్రశంసలు వచ్చాయి కానీ కథలో కన్ఫ్యూజన్ ఎక్కువ వుంది. సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో అస్సలు సినిమా ఆడలేదు. నటుడు హర్షవర్ధన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈషారెబ్బా, మృణాళిని హీరోయిన్లుగా కనపడి ఆకట్టుకున్నారు. ఇక కథ విషయానికి వస్తే.. ఆస్తి కోసం పరశురామ్ (సుధీర్‌బాబు) అసిస్టెంట్ దాసు (హర్షవర్ధన్) సాయం తో తన సొంత చెల్లెలిని చంపాలని అనుకుని మొదలు పెడతాడు. కానీ వర్క్ అవుట్ అవ్వదు.
చాలా ఏళ్ల తర్వాత దుర్గ (సుధీర్ బాబు) అనే రౌడీ, హైదరాబాద్‌కు చెందిన డీజే (సుధీర్ బాబు) పరశురామ్ పోలికలతోనే తారసపడతారు. పరశురామ్‌తో సంబంధం ఏమిటి…? పరశురామ్ కూతురు విశాలక్ష్మి (ఈషారెబ్బా), దాసు కూతురు మీనాక్షి (మృణాళిని) ఎవరు ప్రేమించారు..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…