Madhavi Latha : తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు మాత్రం తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే నటి మాధవీలత ఇటీవలి కాలంలో సినిమాలతో కాకుండా రాజకీయాలకి సంబంధించిన కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాధవీలత తన ఇన్‌స్టా పోస్ట్‌లో షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. తెలంగాణలో వచ్చే ఐదేళ్ల తర్వాత 1 ఫుడ్ ఉండదు, 2 ఉద్యోగాలు ఉండవు, 3 మహిళలకు రక్షణ ఉండదు, 4 హిందువుల పండగలు ఉండవు, 5 శాంతి ఉండదు అని పోస్టు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే.. తాను బీఆర్ఎస్‌కు 99 మార్కులు వేస్తానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీది రావణ రాజ్యమని ‘ఎంజాయ్ గుడ్ లక్ కాంగ్రెస్ లవర్స్’ అంటూ ఆమె పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టుపై కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాధవీలత తన పోస్ట్‌లో బీజేపీ తెలంగాణలో బాగు పుంజుకుందని చెప్పారు. 2018లో ఆ పార్టీకి ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 8కి చేరిందన్నారు. మరో 19 స్థానాల్లో ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. బీజేకి ఓటు బ్యాంకు పెరిగిందని.. కాషాయ పార్టీపై నమ్మకం కూడా పెరిగిందని పేర్కొంది. తెలంగాణలో ఇది బీజేపీకి బూస్ట్ ఇచ్చే అంశమని చెప్పుకొచ్చింది.
మాధవీలత ఒకప్పుడు మంచి సినిమాలు చేసింది. స్నేహితుడా, నచ్చవులే, అరవింద్ 2 వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న వేధింపులు, అవకాశాల పేరుతో లోబరుచుకునే ప్రయత్నాలు లాంటివి జరుగుతాయంటూ సంచలన కామెంట్స్ చేస్తూ వార్తలలోకి ఎక్కింది. తనపై ఎన్ని వివాదాలు జరిగినా, ఎంత ట్రోలింగ్ ఎదురైనా ఆమె మాత్రం తనదైన శైలిలో స్పందిస్తూ హాట్ టాపిక్ అవుతుందటుంది. ఇటీవలి కాలంలో మాధవీలత బీజేపీలో చేరింది. అయితే ఆమె పాలిటిక్స్‌లో అంత యాక్టివ్‌గా లేకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం సంచనల పోస్ట్‌లు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…