వినోదం

Koose Munisamy Veerappan OTT : ఓటీటీలోకి వ‌చ్చేసిన కూసే మునిస్వామి వీరప్పన్ చిత్రం.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అంటే..!

Koose Munisamy Veerappan OTT : ప్రేక్షకులపై థియేటర్ల ప్రభావం ఎంత ఉందో తెలియ‌దు కాని, ఓటీటీ ప్ర‌భావం మాత్రం చాలా ఉంది. ఓటీటీలో వ‌చ్చే కంటెంట్‌ని మిస్ కాకుండా చూస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే కూర్చుని చక్కగా సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వారి టేస్ట్ కు తగ్గట్లుగానే ప్రతీవారం ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ చేస్తుండ‌గా, వాటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ బయోపిక్‌గా వచ్చిన కూసే మునిస్వామి వీరప్పన్ ఓటీటీలో డిసెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కూసే మునస్వామి వీరప్పన్ ఒరిజినల్‌ను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ప్రముఖ ఓటీటీ జీ5లో డిసెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు.

డిసెంబర్ 8 నుంచి ప్రసారం చేస్తున్నట్లు మొద‌ట‌ మేకర్స్ ప్రకటించినప్ప‌టికీ చెన్నైలో వరదల కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు డిసెంబర్ 14 నుంచి జీ5లో కూసే మునిస్వామి వీరప్పన్ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేస్తున్నారు . దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గంధపు చక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘కూసే మునిస్వామి వీరప్పన్’ని చూసేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారు. గంధపు చెక్కల స్మగ్లర్ వీర‌ప్పన్ జీవితంపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. గతంలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం వీరప్పన్ పై ఓ చిత్రాన్ని తీశాడు.

Koose Munisamy Veerappan OTT

రీసెంట్‌గా వీర‌ప్ప‌న్ జీవిత చరిత్ర ఆధారంగా ‘కూసే మునిస్వామి వీరప్పన్’ అనే టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ రూపొందింది. ఇప్పటికే ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దానికి విశేష స్పందన లభించింది. ఈ సిరీస్ కు శరత్ జ్యోతి దర్శకత్వం వహించాడు. కాగా.. గతంలో వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా పలు సినిమాలు వచ్చిన సంగతి మనకు తెలియనిది కాదు. మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెట్టాడు వీరప్పన్. గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తూ.. అటు ప్రభుత్వాలకు ఇటు పోలీసులకు చిక్కకుండా తిరిగాడు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ చేసిన ఎన్ కౌంటర్ లో మరణించాడు వీరప్పన్. ఈ సిరీస్‌లో వీరప్పన్ స్వయంగా నెరేషన్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

Share
Sunny

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM