Kirak RP : జబర్ధస్త్ నుండి బయటకు వచ్చి బిజినెస్ చేయాలని అనుకున్న కిరాక్ ఆర్పీ ఏ ముహూర్తాన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ప్రారంభించాడో కానీ గత కొన్ని రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోతోంది. మొదట కూకట్ పల్లిలో ప్రారంభమైన ఈ కర్రీ సెంటర్‌కు నగరవాసుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. కస్టమర్లను కంట్రోల్ చేయడానికి కర్రీ పాయింట్‌లో ఏకంగా బౌన్సర్లను నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తడంతో ప్రారంభించిన కొన్ని రోజులకే చేపల పులుసు సెంటర్ క్లోజ్ చేశారు
నెల్లూరు వెళ్లి అక్కడి మహిళలను, కొత్త చెఫ్‌లని తీసుకొచ్చి కొత్త ఉత్సాహంతో మళ్లీ కర్రీపాయింట్‌ను ఓపెన్ చేశాడు. బిజినెస్‌లో బాగా లాభాలు వచ్చాయేయో తాజాగా మణికొండలో సైతం రెండో బ్రాంచిని ఏర్పాటుచేశాడు. ఈ ఓపెనింగ్‌కు ఆర్పీ పట్నాయక్, హేమ వంటి సినీ ప్రముఖులతో పాటు హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, శాంతి వంటి జబర్దస్త్ కమెడియన్లు హాజరయ్యారు. ఇందులో స్పెషాలిటీ ఏం లేదు కానీ.. హైపర్ ఆది ఈ కార్యక్రమానికి రావడమే చర్చనీయంశమైంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆర్పీ- ఆది మధ్య టర్మ్స్ అంతగా బాగోలేవు. కాని రీసెంట్‌గా ఆర్పీ చేపల పులుసు కర్రీ పాయింట్ లో ప్రత్యక్షం కావడం అందరిని ఆశ్చర్యపరిచింది.
అయితే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తున్న నేపథ్యంలో కిరాక్ ఆర్పీ ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో యాంకర్ మాట్లాడుతూ.. మీ స్నేహితుడు అదిరే అభి ఓవర్సిస్ లో కూడా మీరు చేపల పులుసు పెట్టాలని కోరుకున్నారు. దానికి మీ సమాధానం ఏంటి అని యాంకర్ ప్రశ్నించింది..”కచ్చితంగా అమెరికాలో ఆర్పీ చేపల పులుసు పెడతాను. కొద్దిగా అనుభవం, మ్యాన్ పవర్ పెరిగాక అక్కడి తెలుగు వారికి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రుచి చూపిస్తాను. త్వరలోనే అన్ని విషయాలు చెప్తాను” అని పేర్కొన్నాడు ఆర్పీ. కాగా, కిరాక్ ఆర్పీ చేపల పులుసు జబర్దస్త్ ప్రోగ్రామ్ పెట్టిన భిక్ష అని ఇటీవల రాకింగ్ రాకేష్ చెప్పుకొచ్చాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…