Keerthy Suresh : ప్రస్తుతం ఇండస్ట్రీలో అనేక ప్రాజెక్ట్‌లు రూపొందుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు భారీ సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ క్రేజీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది. సీట్ ఎడ్జ్ రివేంజ్ థ్రిల్లర్ జోనర్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా ‘అక్క’ అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతోంది. చిత్ర పరిశ్రమలో విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తోన్న వెర్సటైల్ యాక్టర్స్ కీర్తి సురేష్ రాధికా ఆప్టే ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించి అలరించనున్నారు. రాధికా ఆప్టే పెర్పార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సన్నివేశం డిమాండ్ చేసిందంటే? ఎంతటికైనా సై అంటుంది. న్యూడ్ సన్నివేశాల్లో సైతం నటించిన అనుభవం ఆమెకి ఉంది.
లిప్ లాక్ లు..బికినీ ..బెడ్ రూమ్ సీన్లు? ఇలా ఏదైన సరే ఆమె చాలా రియలిస్టిక్‌గా పండించగలదు. అయితే అలాంటి నటితో కీర్తి సురేష్ ఇప్పుడు పోటీ పడాల్సిన సన్నివేశం ఎదురవుతుందా? సీన్ డిమాండ్ చేస్తే రాధిక పోటీగా తగ్గేదేలే అంటుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన తొలి చిత్రం అక్క ప్రాజెక్ట్ కోసం టీమ్ తెలివిగా ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఎంపిక చేసుకుంది. ప్రతిష్టాత్మకమైన ప్రొడక్షన్ హౌస్ వైఆర్‌ఎఫ్‌తో ఈ రంగంలోకి అడుగుపెట్టినందుకు కీర్తి చాలా సంతోషంగా ఉంది. పీరియడ్ రివెంజ్ థ్రిల్లర్‌గా ఇది తెరకెక్కుతోంది.
ఇందులో హీరోయిన్ రెండు పాత్రలు పోటా పోటీగా ఉంటాయట. నువ్వా? నేనా? అన్న రేంజ్ లో సాగుతాయని ఇన్‌సైడ్ టాక్. రివేంజ్ థ్రిల్లర్ కావడంతో కంటెంట్ పరంగానూ బోల్డ్ గా వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చాలా పద్దతిగా కనిపించిన కీర్తి ఇందులో బోల్డ్‌గా కనిపించడానికి అంగీకరించిందా? లేదా? అన్నది తెలియదు గానీ ఆమె పేరు ప్రధానంగా హైలైట్ అవ్వడంతో రాధికా ఆప్టేతో పోటీ పడి నటించగలదా? అన్నది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సిరీస్ మెజార్టీ షూటింగ్ పూర్తయిన తర్వాతే దీని గురించి వివరాలను వెల్లడించాలని మేకర్స్ భావిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…