Karimnagar’s Most Wanted OTT Release Date : ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు ఓటీటీలో తెగ సందడి చేస్తున్నాయి. అలానే తెలుగు వెబ్ సిరీస్‌లు కూడా ఆకట్టుకుంటున్నాయి. సైతాన్, అతిథి వధువు, ధూత, వ్యూహం తదితర తెలుగు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులని ఎంతగానో అలరించగా, ఇప్పుడు అదే జాబితాలో వచ్చింది కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్. ఇందులో చాలా నటించిన వారు అందరు దాదాపు కరీంనగర్‌కి చెందిన వారే. షూటింగ్ కూడా కరీంనగర్‌లోనే జరిగింది. తెలంగాణ నేపథ్యంలో పక్కా లోకల్ లాంగ్వేజ్‌లో తెరకెక్కిన తొలి వెబ్ సిరీస్ కి బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించారు. సాయి, అమన్ సూరేపల్లి, సాసా, బాలాజీలు ప్రధాన పాత్రలు పోషించారు.
ఇందులో ఉన్న ‘కరీంనగర్ వాలే’ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ప్రముఖ టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేరాలు, లోకల్ పాలిటిక్స్ చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్ రూపొందింది. మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ డిసెంబర్ 22వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానున్నట్టు ఆహా అధికారంగా వెల్లడించింది. “ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా లోకల్ పాలిటిక్స్ డ్రామా డిసెంబర్ 22న ఆహాలో స్ట్రీమింగ్ కానుందని తెలియజేశారు. సస్పెన్స్, డ్రామా, కుట్రలను మిస్ కావొద్దని ఆహా వారు తెలియజేశారు.
ఈ వెబ్ సిరీస్‌కు సంకీర్త్ రాహుల్ కెమరామేన్‌గా పనిచేశారు. ఆయన విజువల్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా కొన్ని షాట్స్ సినిమా మేకింగ్‌ను గుర్తుచేస్తున్నాయి. ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం సమకూర్చారు. ఎస్.అనంత్ శ్రీకర్ నేపథ్య సంగీతం అందించారు. ‘బలగం’ ఫేం రచయిత రమేష్ ఎలిగేటి ఈ సిరీస్‌కు కథా, కథనం, సంభాషణలు అందించారు. ‘బలగం’ ఫ్యామిలీ డ్రామా అయితే దానికి పూర్తి భిన్నమైన పొలిటికల్ క్రైమ్ డ్రామా ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ అని చెప్పవచ్చు. ట్రైలర్‌లో వినిపించిన డైలాగ్స్‌లో నటీనటులంతా కరీంనగర్ యాసని అద్భుతంగా పలకడం కొసమెరుపు. మరి రేపు రానున్న ఈ వెబ్ సిరీస్‌ని అస్సలు మిస్ కావొద్దు.జిల్లాలోని క్రిమినల్ వరల్డ్, రాజకీయాలు ఈ కథలో ప్రధానంగా ఉంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…