Kajal Uma Movie : కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాల స్పీడ్ పెంచింది. బిజినెస్‌లు చేస్తూనే సినిమాలతో అలరిస్తుంది. గతేడాది అక్టోబర్ 30న గౌతమ్‌తో ఏడడుగులు నడిచిన కాజల్.. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూనే ఉంది. ఇంకా చెప్పాలంటే గతంలో కంటే ఎక్కువ పారితోషికమే తీసుకుంటుంది. ఈ అమ్మడు కొద్ది రోజుల క్రితం హిందీలో ఉమా అనే సినిమా చేసింది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు తతగత సింఘా దర్శకత్వం వహించారు. మిరాజ్ గ్రూప్ బ్యానర్‌పై అవికేష్ ఘోష్, మంతరాజ్ పాలివాల్ నిర్మించారు. ఒక పెళ్లి ఇంట్లో చోటు చేసుకున్న సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం కాజల్ ఏకంగా రూ.2.3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది.
కాజల్ తన కెరీర్‌లో అంత మొత్తం రెమ్యునరేషన్ తీసుకోవడం అదే తొలిసారి అని అన్నారు. ఉమా చిత్రం ఎప్పుడో రిలీజ్ కావలసి ఉన్నా కూడా కాజల్ పెళ్లి, ప్రెగ్నెన్సీలతో కొంత బ్రేక్ ఇవ్వడంతో సినిమాపై ఉన్న క్రేజ్, బజ్ పడిపోయింది. దీంతో కాజల్ ఉమా మూవీ థియేటర్‌లో రాకుండా పోయింది. కాజల్‌తో పాటు జనాలు మర్చిపోయిన ఈ సినిమా ని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా, జనవరి 19 లేదా 26 నుంచి కాజల్ ఉమా మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు చెబుతోన్నారు.
ఈ లేడీ ఓరియెంటెడ్ డ్రామా మూవీలో కాజల్ అగర్వాల్‌తో పాటు ఆయోషీ తాలుక్‌దార్, గౌరవ్ శర్మ ప్రధాన పాత్రలను పోషించారు. ఓ రాజవంశీయుల పెళ్లి వేడుకలోకి అపరిచితురాలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అపరిచితురాలు ఎవరు అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. ఇక కాజల్ కొద్ది రోజుల క్రితం భగవంత్ కేసరితో పెద్ద సక్సెస్‌ను అందుకున్నది కాజల్. ప్రస్తుతం సత్యభామ పేరుతో ఓ యాక్షన్ మూవీ చేస్తుండగా, ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నది. ఈ చిత్రం కాజల్‌కి మంచి పేరు తీసుకు రానుందని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…