Japan OTT Streaming : తమిళ స్టార్ హీరో సూర్య సోదరుడు, ప్రముఖ నటుడు కార్తి తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరచితమే. ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. కార్తీ కెరీర్‌లో 25వ సినిమాగా జపాన్ రూపొందించబడింది. జపాన్ కోసం కార్తీ తన మేకోవర్ మార్చుకున్నాడు. కొత్తగా కనిపించాడు. కొత్తగా వినిపించాడు. తన గొంతులోని మాడ్యులేషన్ సైతం కొత్తగా వినిపించి అలరించింది. నవంబర్ 10న ఈ చిత్రం థియేటర్లోకి వచ్చి ప్రేక్షకులని మెప్పించింది. అయితే జపాన్ మూవీ తమిళ్ వర్షన్ కొద్ది రోజుల క్రితం ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తెలుగు వర్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.నేటి( డిసెంబర్ 13) నుంచి జపాన్ తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ జపాన్ సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకోగా, జపాన్ సినిమాను తెలుగు, తమిళ భాషలలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించినన్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. జపాన్ సినిమాలో కార్తీ డిఫరెంట్ లుక్ లో కనిపించి మెప్పించారు. అలాగే ఆయన స్లాంగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులని మెప్పించే కార్తీ సినిమా కోసం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. జపాన్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం నిరాశపరచింది. సినిమా మొదట్లో బాగున్నా తర్వాత బోర్ కొట్టిస్తుంది. రెగ్యూలర్ సీన్లు ఉంటాయి. సినిమాలో చూపించిన ట్విస్టులు పెద్దగా వర్కౌట్ కాలేదు.
జపాన్ చిత్రంని కార్తీన్ని ఒక్కడే తన భుజాన మోసినట్టుగా అనిపిస్తుంది. సునీల్ పాత్ర కొన్ని సార్లు సీరియస్‌గా అనిపిస్తుంది. ఇంకొన్ని సార్లు కామెడీగా కనిపిస్తుంది. అను ఇమాన్యుయేల్ పాత్రకు ఇంపార్టెన్స్ లేదనిపిస్తుంది. కనిపించేది కూడా కొద్ది సేపే. కేఎస్ రవికుమార్, రాజేష్ అగర్వాల్ ఇలా మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపిస్తాయి.సాంకేతికంగా చూస్తే.. మాటలు కొన్ని చోట్ల నవ్విస్తాయి. ఇంకొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. పాటలు ఏమంత ప్రభావాన్ని చూపించవు. విజువల్స్ బాగుంటాయి. ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడం వల్లే నిడివి కూడా సమస్యగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…