Japan OTT Release Date : ఇప్పుడు తమిళంతో పాటు ఇతర భాషలకి చెందిన హీరోలని కూడా మన తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకుంటున్నారు. వారి సినిమాలని ఎంతగానో ఆదరిస్తున్నారు. ఏ భాషకి చెందిన హీరో అయిన మంచి ఎంటర్ టైన్‌మెంట్ సినిమా అంటే తప్పక అక్కున చేర్చుకుంటున్నారు. ఖైదీ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కోలీవుడ్ హీరో కార్తీ ఇప్పుడు అదే జోష్ తో జపాన్ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిల్చింది. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి హైప్ పై రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులని అంతగా అలరించలేకపోయింది.
నటన పరంగా కార్తీ తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ, ప్రేక్షకులకు మాత్రం ఈ మూవీ అంతగా కనెక్ట్ కాలేదు. దీంతో థియేటర్ల నుంచి తొందరగానే వెళ్లిపోయిన ఈ చిత్రం వెండితెరపై వచ్చి నెలరోజులు గడవకముందే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. జపాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. జపాన్ సినిమా భారీ అంచనాలతో విడుదలై నిరాశ మిగిల్చిడంతో..ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. తాజాగా ఓటీటీ రిలీజ్‌పై అఫీషియల్ ప్రకటన రాగా, డిసెంబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో జపాన్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. హిందీకి సంబంధించి ప్రకటన రాలేదు.
కార్తీ కెరీర్‌లో 25వ సినిమాగా వచ్చిన జపాన్ చిత్రంలో టాలీవుడ్ కమెడియన్ సునీల్ కీలక పాత్ర పోషించాడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు. డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది.ఈసినిమాలో హీరో కార్తీకి బంగారం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ దొంగతనాలు చేస్తూ ఆ డబ్బుతో జల్సాగా జీవించే అతను ఉన్నట్లుండి అతడు రూ.200 కోట్ల విలువైన బంగారం దొంగతనం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. చేయని నేరం నుంచి కార్తీ ఎలా తప్పించుకున్నాడనేది జపాన్ చిత్రం. థియేటర్‌లో మిస్ అయిన వారు ఈ మూవీని ఓటీటీలో చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేయండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…