Jabardasth : క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా వినబడుతోంది. అడపా దడపా ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి క్యాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డ భామలు నిర్భయంగా బయటకు వచ్చి నిజానిజాలని బయట పెడుతున్నారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమం ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజా, నాగబాబు లాంటి వాళ్లకు కూడా కెరీర్ డైలమాలో ఉన్నప్పుడు ఊపిరి ఊదింది ఈ కామెడీ షో. అనసూయ, రష్మి గౌతమ్ కూడా ఈషోతోనే లైమ్ లైట్‌లోకి వచ్చారు. ఎంతో మంది ఈ షోతో కమెడీయన్స్ గా మంచి పొజిషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం సినిమా అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటున్నారు.
జబర్ధస్త్ చూసి మిగిలిన ఛానల్స్‌లో కూడా అచ్చం అలాంటి కాన్సెప్ట్ తోనే కామెడీ షోలు మొదలు పెట్టి చేతులు కూడా కాల్చుకున్నారు. అలాంటి బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న జబర్దస్త్ కామెడీ షోపై ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ఒకప్పుడు అబ్బాయిలు లేడీ గెటప్ వేసుకొని కామెడీ చేసే వాళ్లు. ఇప్పుడు అమ్మాయిలు నటిస్తున్నారు.
కొందరు అమ్మాయిలకి టీం లీడర్స్ నుండి వేధింపులు ఎక్కువ అవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. సాయంత్రం ఖాళీగా ఉన్నారా, కలుద్దామా.. లాంటి అనుభవాలు సమస్యల రూపంలో వస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. నిర్వాహకుల వరకు ఈ విషయం తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయిందని టాక్. ఇందులో ఎంత నిజం ఉందనేది.. తెలియాల్సి ఉంది.