Hi Nanna OTT Release : నేచురల్ స్టార్ నాని దసరా చిత్రంతో అతి పెద్ద విజయం సాధించి అదే జోష్‌తో హాయ్ నాన్న మూవీతో పలకరించాడు. శౌర్యూవ్ దర్శకత్వంలో నాని నటించిన ‘హాయ్ నాన్న’ మూవీకి ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. ఇదే అన్ని ఏరియాల్లోనూ కనిపించింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా లభించింది. ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తండ్రి కూతురు మధ్య సాగె ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఎప్పటిలానే నాని తన నటనతో ప్రేక్షకులను అలరించాడు.
హాయ్ నాన్న సినిమాకు యూఎస్‌లో కూడా మంచి కలెక్షన్స్ దక్కాయి.అయితే థియేటర్‌లో మిస్ అయిన వాళ్లు ఈ సినిమాని ఓటీటీలో చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా హాయ్ నాన్న సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతుందని టాక్ వినిపిస్తుంది. హాయ్ నాన్న ఓటీటీ రైట్స్ ను ఓ ప్రముఖ సంస్థ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ హాయ్ నాన్న సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తుండగా, జనవరి 12 అంటే సంక్రాంతికి ఈ సినిమాను ఓటీటీలోకి వదిలే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సందడి చేస్తున్న సమయంలో హాయ్ నాన్న ఓటీటీలో ప్రేక్షకులని ఎంతలా అలరిస్తుందో అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హాయ్ నాన్న’ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. చిత్రంలో బేబీ కియారా ఖన్నా నాని కూతురి పాత్రను పోషించింది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించాడు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…