Hi Nanna OTT : నేచురల్ స్టార్ నాని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమా ‘హాయ్ నాన్న చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించారు. అలాగే హృదయం, ఖుషి వంటి సూపర్ హిట్ సాంగ్స్ అందించిన మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ హాయ్ నాన్నకు సంగీతం అందించారు. రేపే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ ఒకేలా ఉంటుంది. ఒకరు ప్రేమను అంగీకరించడం, మరొకరు తిరస్కరించడం, మనస్పర్థలు రావడం, విడిపోవడం, మళ్లీ కలవడం ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అయితే ఈ కథని యూనిక్‌గా చెబుతున్నామనది ముఖ్యం అంటూ నాని అన్నాడు. హాయ్ నాన్న డిజిటల్ రైట్స్ (అన్ని భాషలతో కలిపి) రూ.37 కోట్లు పలికినట్టు తెలుస్తుంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ఈ డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. అలానే హిందీ డబ్బింగ్, థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతకి మరో 7.5 కోట్లు కూడా దక్కాయి. దీన్ని బట్టి రిలీజ్‌కి ముందే నిర్మాతకి భారీ ఊరట కలిగినట్లే.
దసరా సినిమాతో తన కెరీర్‌లోనే తొలిసారి రూ.100 క్లబ్‌లో చేరిన నాని ఈ సినిమాతో కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరున్నాడని అంటున్నారు. ఇతర భాషల్లో కూడా నానికి మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు నాని. తాజాగా బెంగళూరులో ప్రమోషనల్ టూర్‌లో భాగంగా కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌ని కలిశాడు నాని. ఆయన ఇంట్లోనే బ్రేక్‌ఫాస్ట్ కూడా చేశాడు. ఈ సందర్భంగా ‘హాయ్ నాన్నా’ సినిమా విశేషాలను శివన్న అడిగి మరీ తెలుసుకున్నారట. శివ రాజ్‌కుమార్‌తో నాని తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కన్నడలో కూడా హాయ్ నాన్న విడుదల కానుండటంతో తప్పకుండా సినిమాను హిట్ చేయాలని శివన్న తన అభిమానులను కోరారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…