Hansika Motwani : దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దుగుమ్మ హన్సిక.శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. చిత్రంలో ఆడుక్కాలమ్ నరేన్, రాజా రవీంద్ర, మురళీ శర్మ, ఆర్ నారాయణ్, జయప్రకాష్, వినోదిని, సాయి తేజ్, పూజా రామచంద్రన్, తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నవంబర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.స్కిన్ మాఫియా ముప్పును స్పృశించే డార్క్ థ్రిల్లర్ చిత్రంగా ఇది రూపొందగగా, ఇలాంటి జానర్‌లో హన్సిక చిత్రం చేయడం ఇదే తొలిసారి. ఇందులో హన్సిక పాత్ర ఓ ట్రాప్‌లో పడుతుంది. శృతి యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. ఆమె తనకు తానుగా బెయిల్ తెచ్చుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూస్తే అర్ధమవుతుంది.
సినిమాలో శృతికి ఓ భయంకరమైన, అధిగమించలేదని సమస్య ఎదురవుతుంది? దాని నుండి శృతి ఎలా బయటపడింది అనేదే ఈ చిత్ర కాన్సెప్ట్ కాగా, హన్సిక తల్లి అమ్మ డెర్మటాలజిస్ట్. ఈ సినిమా చేసే క్రమంలో నిజంగా స్కిన్ మాఫియా ఉందా? అని తల్లిని అడిగింట. తను కూడా ఎక్కడో ఇలాంటి ఘటన జరిగినట్లు చదివానని చెప్పింది” అని హన్సిక చెప్పుకొచ్చింది.ఇక ఈ చిత్రంలో ఫస్టాఫ్ ఇంటర్వెల్ లో ఓ మర్డర్ ట్విస్ట్ ఇచ్చి సినిమాపై ఆసక్తిని రేపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్ లో ఏం జరుగుతుందనే ఉత్కంఠకి గురి చేసిన తీరు ఫర్వాలేదనిపించింది. సెకండాఫ్‌లో అసలు కథ రివీల్ చేస్తూ వచ్చాడు.
ట్రాప్ లో పడిన హన్సిక పెర్ఫార్మెన్స్ తో అదరహో అనిపించింది.. ఉన్నంతలో ఫర్వాలేదనిపించినా స్క్రీన్‌ప్లే మరింత గ్రిప్పింగ్‌గా ఉంటే బాగుండేది అని కొందరు అంటున్నారు.. దీంతో పాటు ఇన్వెస్టిగేషన్ అంశాల్లో ఇంకాస్త పరిణితి అవసరం అనిపించింది. ఓవరాల్‌గా చెప్పాలంటే స్కిన్ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది. మంచి సందేశం ఇచ్చారు.సినిమా భారాన్నంతా తన భుజాలపై వేసుకొని.. గ్లామర్, ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో చక్కగా ఒదిగిపోయింది హన్సిక.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…