వినోదం

Guppedantha Manasu October 30th Episode : రిషిని కాపాడిన అనుప‌మ.. దేవ‌యానికి మొదలైన భ‌యం, శైలేంద్ర ప్లాన్ ఫెయిల్‌.. అనుపమ స్టోరీ అవుట్..!

Guppedantha Manasu October 30th Episode : అరకు టూర్ ని రిషి, వసుధారా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అరకు అందాల నడుమ రిషికి వసుధారా ఐ లవ్ యు అని చెప్తుంది. రిషి కూడా, వసుధారకి ప్రపోజ్ చేస్తాడు. ప్రకృతి అందాలని చూసి, వసుధార చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. జీవితానికి ఈ సంతోషం చాలు అంటుంది. ఎప్పటికీ ఇలానే ఆనందంగా ఉండాలని, వసుధార తో అంటాడు. రిషితో ఎట్టి పరిస్థితుల్లో, మీ చేయి వదలను రిషికి మాట ఇస్తుంది వసుధార. ప్రకృతి, పంచభూతాలకు ప్రతిరూపం మన బంధం అని చెప్తుంది. ప్రేమ బంధం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోవాలని రిషితో అంటుంది.

చల్లటి వాతావరణం లో, ఒక కప్పు కాఫీ తాగాలని ఉంది అని, రిషి ని వసుధర అడుగుతుంది. క్షణంలో కాఫీ తీసుకువస్తాడు. కానీ ఒక కప్పు మాత్రమే తీసుకొస్తాడు. ఇద్దరు కాఫీ ని షేర్ చేసుకుంటారు. మనం మొదలుపెట్టిన ప్రయాణానికి, చేరుకున్న గమ్యానికి సంబంధం ఉండదని, తన జీవితం అలానే సాగిందని వసుధార, తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. ఒక స్టూడెంట్ గా, కాలేజీ లైఫ్ ని మొదలు పెట్టి, జీవిత భాగస్వామిగా మీ లైఫ్ లో కి వచ్చానని రిషితో చెప్తుంది. ఈ మజిలీ ఇంకా ఎన్నో భావోద్వేగాలని మొస్తుందో, ఎన్ని మలుపులు తిరుగుతుందో ఇంకా ఎంత దూరం తీసుకెళ్తుందో చూడాలి అని వసుధారా చెప్తుంది.

ఎంత దూరం తీసుకెళ్లినా, ఏ గమ్యానికి చేర్చిన, ఈ చేయి వదిలిపెట్టనని మాటిస్తాడు. ప్రాణం పోయినా నిన్ను వదులుకోనని, మాట ఇస్తాడు రిషి. పక్కన నువ్వుంటే వెయ్యి టన్నుల బారువైనా దూదిపింజిలా తేలికగా అనిపిస్తుందని, ఎంతటి కష్టమైనా ఎదుర్కోగలనని వసుధారతో రిషి చెప్తాడు. భర్త మాటలు విని ఎంతో ఆనందపడుతుంది. ఈ సంతోషానికి కారణం అమ్మ జగతి అని గుర్తు చేసుకుంటాడు. తను చేసిన త్యాగమే మన ముఖంలో చిరునవ్వుల్ని తీసుకు వచ్చింది. ఇలా కలిసిపోవడం అమ్మ చూస్తే హ్యాపీగా ఉండేదని రిషి అనుకుంటాడు.

తల్లి జ్ఞాపకాలు తండ్రిని మత్తుకి బానిస చేయకూడదు. మునుపటి మహేంద్ర మారేవరకు కొత్త బంధాలు పెట్టుకోకూడదని చెప్తాడు. రిషి భర్త చెప్పిన దానికి అంగీకరిస్తుంది. మన సంతోషంతో పాటుగా, వాళ్ళు సంతోషం కూడా ముఖ్యమని అంటుంది. భర్తని అర్థం చేసుకునే భార్య దొరకడం కంటే సంతోషము ఇంకొకటి ఉండదని రిషి ఆనందంగా ఉంటాడు. శైలేంద్ర పెట్టిన రౌడీ వసుధరాని రిషి ని ఫాలో అవుతూ అడవిలోకి వస్తాడు. వారిద్దరిని చూస్తాడు. అప్పుడు శైలేంద్ర కి రౌడీ ఫోన్ చేస్తాడు. రిషి ని చంపేసావ అని అడుగుతాడు శైలేంద్ర.

Guppedantha Manasu October 30th Episode

ఇప్పుడే స్పాట్ పెట్టానని, కొద్ది క్షణాల్లో రిషి చనిపోతాడని అంటాడు. లైవ్ లో రిషి వసుధారలని శైలేంద్ర కి చూపిస్తాడు. రౌడీ కత్తి తీసుకొని, రిషి వసుధారాలని ఫాలో అవుతాడు. అనుకోకుండా లైవ్ వీడియోలో అనుపమ కనపడుతుంది. ఆమెను చూసి దేవయాని షాక్ అయిపోతుంది. రిషి వసుధారలని చంపాలన్న ప్లాన్ ని పక్కన పెట్టి వెనక్కి వచ్చేయమని అంటుంది. రిషి మీద ఎటాక్ చేస్తున్న విషయం అనుపమకు తెలిస్తే, వాళ్లు బతికే ఛాన్స్ లేదని అంటుంది.

రిషి పై అటాక్ చేయొద్దని ఎంత చెప్పినా, రౌడీతో పాటు శైలేంద్ర కూడా వినడు. శైలేంద్రని గట్టిగా ఒకటి ఇస్తుంది దేవయాని. చెప్తే అర్థం కాదా అని అంటుంది. తల్లి భయం చూసి శైలేంద్ర కూడా కంగారు పడతాడు. ఎటాక్ నుండి డ్రాప్ అవ్వమని, రౌడి తో చెప్తాడు. కానీ, రౌడీ మాత్రం రిషి మాట వినడు. కత్తితో పొందడానికి వెళ్తాడు. రిషి పైకి రౌడీ ఎటాక్ చేస్తున్న సంగతి అనుపమ చూస్తుంది. రిషిని కాపాడుతుంది. మిస్ అవ్వడంతో, రౌడీ అక్కడి నుండి పారిపోతాడు. అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ కుదరదు. రిషి వసుధారలని అనుపమ కాపాడుతుందని అనుకున్నానని, శైలేంద్రతో దేవయాని అంటుంది.

జగతి మహేంద్రలకి అనుపమ ప్రాణ స్నేహితురాలు. తన వల్లే వాళ్ల పెళ్లి జరిగిందని కొడుకుతో చెబుతుంది దేవయాని. అనుపమ తనకే చుక్కలు చూపించిందని, చూడటానికి పద్ధతిగా కనిపించే అనుపమ చాలా వైలెంట్ అని చెప్తుంది. రిషి వాళ్లకి అనుపమ తెలుసా అసలు, అనుపమ అక్కడ ఎందుకు ఉంది అనే సమాచారం కావాలని చెప్తుంది. రిషి వాళ్ళు రిస్టార్ కి దెబ్బలతో వస్తారు. మహేంద్ర కంగారు పడతాడు.

ఏమైందని అడిగితే, ఇద్దరు ఏం కాలేదని చెప్తారు. వారితో పాటుగా అనుపమ కూడా ఉంటుంది. మహేంద్రని పిలవడం చూసి అనుపమ షాక్ అయిపోతుంది. మహేంద్ర తన తండ్రి అని అనుపమ కి పరిచయం చేస్తాడు. ఆమె కాపాడినందుకు రిషి అనుపమకి థాంక్స్ చెప్తాడు. మహేంద్ర ని మీ పేరేంటి రిషి అడిగితే, అనుపమ అంటుంది. రిషి వసుధార ఆలోచనలో పడతారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM