Guppedantha Manasu October 26th Episode : రిషి, వసుధార అరకులో ఉంటాడని తెలుసుకుంటాడు శైలేంద్ర. రిషి ని చంపడానికి రౌడీలతో ప్లాన్ వేస్తాడు. ఆ రౌడీల నుండి రిషి ని అనుపమ కాపాడుతుంది. శత్రువులు ఎవరో చెప్పమని వసుధారని రిషి అడుగుతాడు. శైలేంద్ర, దేవయాని పేర్లు చెప్తే నమ్మడని వసుధార అనుకుంటుంది. ఆధారాలు లేకపోవడంతో చెప్పదు. ఉదయం వసుధార లేవగానే కాఫీ కప్పుతో రిషి కనబడతాడు. నీకోసమే స్పెషల్ గా, ఈ కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చా అని వసుధారతో చెప్తాడు. భర్త చేతితో ఇచ్చిన కాఫీ తాగే అదృష్టం, ఎంత మంది భార్యలకి ఉంటుందో తెలియదు.
కానీ, నేను మాత్రం లక్కీ అని అంటుంది. రిషి ని బాగా పొగుడుతుంది వసుధార. అతని ప్రేమకు ఆమె ఫిదా అయిపోతుంది. వసుధార చెప్పినదానికి రిషి నాది కూడా సేమ్ ఫీలింగ్ అంటాడు. కాఫీ తాగకుండా, రిషినే చూస్తూ ఉంటుంది. కాఫీ తొందరగా తాగితే, కప్పు తీసుకువెళ్తానని అంటాడు. మీతో సేవలు చేయించుకోవడం నేను ఊహించుకోలేనని, ఇబ్బందిగా ఉంటుందని రిషితో అంటుంది. మీరు రిషి సార్. ఎప్పుడు జెంటిల్ మాన్ లాగ ఉండాలి అని చెప్తుంది.
నిన్ను ఇబ్బంది పెట్టే, పనులు నేను చేయనని రిషి చెప్తాడు. రిషి వసుధార అడ్రస్ తెలియకపోవడంతో, శైలేంద్ర అసహనానికి లోనవుతాడు. వసుధార అప్పుడు ఎక్కడ వున్నారో చెప్పదు. రిషి వసుధార ఆచూకీ కోసం ధరణిని వాడుకోవాలని అనుకుంటాడు. ధరణి ఫోన్ ద్వారా వసుధారతో చాటింగ్ చేయాలని అనుకుంటాడు. ఫోన్ లాక్ లో ఉండడంతో, ధరణి మీద ప్రేమ కురిపిస్తాడు. భర్త యాక్టింగ్ ని ధరణి కనిపెడుతుంది. ధరణి ఫోన్ లాక్ ఓపెన్ చేసి ఇస్తుంది. వసుధార తో ధారాణిలాగా రిషి చాటింగ్ చేస్తాడు. వసుధార, రిషి తో పాటు మహేంద్ర యోగక్షేమాల గురించి అడుగుతాడు. తర్వాత ఎక్కడున్నారు అని అడుగుతాడు.
ఆ మెసేజ్లు శైలేంద్ర పంపించాడని, అనుమానించిన వసుధార, తాను ఉన్న ఏరియా ఫోటో తీసి పంపిస్తుంది. ప్లేస్ ఎక్కడ అన్నది చెప్పదు. కానీ, ఆ ప్లేస్ ని చూడగానే శైలేంద్ర కనిపెడతాడు. తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందని, హ్యాపీ అయిపోతాడు. తన భర్త ఏదో కుట్ర చేస్తున్నాడని, అతనితో జాగ్రత్తగా ఉండమని ధరణి పేరుతోనే ఇన్ డైరెక్టుగా వసుధారని బెదిరిస్తాడు శైలేంద్ర.
నువ్వు చెప్పకపోయినా రిషి, వసుధార ఎక్కడున్నారో తెలిసిపోయింది అని ధరణితో అంటాడు శైలేంద్ర. ఇప్పుడు నేను ఏం చేయాలో అది చేస్తాను అంటాడు. భర్త దుర్మార్గపు ఆలోచనలు చూసి ధరణి భయపడుతుంది. అరకులో ఉండడానికి మహేంద్ర ఇబ్బందులు పడడం వెనక బలమైన కారణం ఉందని, రిషి అనుకుంటాడు. అను అని కలవరించడం, ఆమె ఎవరని అడిగితే దాచడం వలన, రిషి అనుమానం బలపడుతుంది. రిషి ఒంటరిగా బయటకి వెళ్తుండడంతో, మహేంద్ర కూడా డౌట్ పడి ఫాలో అవుతాడు.
కానీ, మధ్యలోరిషి కనపడడు. జగతి గురించి తెలుసుకోవడం కోసం, మహేంద్ర రిసార్ట్ కు వెళ్లకుండా పార్క్ కి బయలుదేరుతుంది అనుపమ. రిషి అడ్రస్ కనిపెట్టిన శైలేంద్ర అతన్ని చంపడం కోసం, రౌడీలను పంపిస్తాడు. రిషి ఒంటరిగా బయటకు వెళ్తాడు. రౌడీలు అతనిపై అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తారు. రిషి ని ఆక్సిడెంట్ చేసి, చంపాలని అనుకుంటారు. చివరి నిమిషంలో అనుపమ వచ్చి రిషిని సేవ్ చేస్తుంది.
నీకు ఇక్కడ శత్రువులు ఎవరైనా ఉన్నారా..? జీప్ డ్రైవర్ కావాలని యాక్సిడెంట్ చేయాలని ప్రయత్నించాడని అతని తీరు చూస్తే అర్థమవుతోందని రిషి ని హెచ్చరిస్తుంది. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తుంది. రిషి ని అతని రిసార్ట్ దగ్గర, తన కారులోనే డ్రాప్ చేస్తుంది అనుపమ. రిషి అనుపమ కలిసి రావడం చూసి, షాక్ అవుతాడు మహేంద్ర. మహేంద్ర స్టే చేస్తున్న రిసార్ట్ అదే కావడంతో, అతడి గురించి రిషిని అడగాలని అనుపమ అనుకుంటుంది. కానీ, అడగదు. అక్కడతో ఈరోజు ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…