వినోదం

Guppedantha Manasu October 19th Episode : శైలేంద్ర ప్లాన్.. రిషి ఇచ్చిన ఐడియా.. రిషిధార హనీమూన్.. మహేంద్ర జీవితంలోకి ఓ కొత్త పాత్ర..!

Guppedantha Manasu October 19th Episode : ఎండీగా వసుధర చేరిన వెంటనే, స్టాఫ్ అందరు కూడా జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తారు. జీతాలు పెంచితే ఉంటాం. లేకపోతే, రిజైన్ చేసేస్తామని చెప్తారు. మేం పాఠాలు చెప్పడంతో పాటు, మిషన్ ఎడ్యుకేషన్ వంటి మిగిలిన పనులు కూడా చేస్తున్నామని చెప్తారు. ఈరోజు నేను ఎండి అయ్యాను. చాలా పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి. అవన్నీ అయ్యాక బోర్డు మీటింగ్ పెట్టి, ఫైనల్ చేస్తానని వసుధారా చెప్తుంది. మీరు బానే ఎండి సీట్ లో కూర్చున్నారు. మా సంగతి ఏంటి అని లెక్చరర్లు అంటారు. మీరు జీతం పెంచాకనే పాఠాలు చెప్తామని అంటారు.

లెక్చరర్స్ వెళ్లిపోయాక, ఇదంతా ఎవరైనా చేస్తున్నారా అని వసుధారా అనుమాన పడుతుంది. లెక్చరర్స్ వెంటనే శైలేంద్ర ని కలుస్తారు. మా జీతాలు గురించి ఆలోచించే మీలాంటి వాళ్ళు, ఎండి అయితే మాలాంటి వాళ్ళకి మంచి జరుగుతుందని వెళ్ళిపోతారు. బయటకు వెళ్లిన రిషి, రోడ్డు పక్కన కారు ఆపి, వసు కి ఫోన్ చేస్తాడు. పనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే, అడగమని చెప్తాడు. వసుధార టోన్ చూసి ఏమైంది అని అడుగుతాడు. లెక్చరర్స్ వచ్చి జీతాలు పెంచమన్న విషయం గురించి చెప్తుంది.

ఇంత చిన్న సమస్యకే, భయపడి పోతే ఎలా, ఇంతకన్నా పెద్ద సమస్యలు వస్తాయి. కాసేపట్లో క్యాబిన్ కి వస్తానని చెప్పి, ఫోన్ కట్ చేస్తాడు రిషి. కాలేజీలోకి వెళ్లి వసు ఎండి సీట్ లో కాకుండా, పక్క సీట్లో కూర్చోవడంపై క్వశ్చన్ చేస్తాడు. ఆ సీట్లో కూర్చోవడం నా వల్ల కాదు నన్ను బలవంతం పెట్టొద్దు అంటుంది. లెక్చరర్స్ శాలరీ ఇష్యూ కి సంబంధించి పరిష్కారం చెప్పమని అంటుంది. నేను లెక్చరర్ గా జాయిన్ అవుతున్నాను. కాలేజీ ఎండిగా చేసి, ఇప్పుడు లెక్చరర్ గా ఏమిటి అని వసు అడుగుతుంది. నాకు ఇష్టమైన జాబ్ అని రిషి చెప్తాడు.

Guppedantha Manasu October 19th Episode

నేనే కాదు చాలామంది లెక్చరర్లు వస్తారు. రిటైర్డ్ లెక్చరర్లు చాలా మంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళ రెస్యూమ్స్ వస్తాయి. ఎవరు, ఏ సబ్జెక్టు చెప్తారో ఫైనల్ చెయ్యి అని రిషి చెప్తాడు. ఈ లోగా స్టూడెంట్ యూనియన్ సభ్యులు వస్తారు. సిలబస్ కంప్లీట్ అవ్వాలి. ఇలాంటి టైంలో సిలబస్ పై దృష్టి పెట్టాల్సిన లెక్చరర్స్ మానేస్తాం అంటున్నారు. రిటైర్డ్ లెక్చరర్స్ ముందుకు వచ్చారు. నేను మిషన్ ఎడ్యుకేషన్ కింద అరేంజ్ చేస్తున్నాను. దీన్ని ఎవరూ కాదనే ఛాన్స్ లేదు.

వాళ్ళు వర్క్ చేయాలి అనుకుంటే, వాళ్ళ డ్యూటీ లోకి రావచ్చు. ఇప్పుడున్న లెక్చరర్లు రానంత వరకు, వీళ్లు పాఠాలు చెప్తారని రిషి అంటాడు. ఇందులో ఎవరికైనా అభ్యంతరం ఉందా అని అడిగితే, స్టూడెంట్స్ అంతా ఏం లేదని చెప్తారు. స్టూడెంట్స్ వెళ్ళిపోయాక వసుధారా కన్నీళ్ళతో రిషి ని హగ్ చేసుకుంటుంది. సమస్య పరిష్కరించినందుకు సంతోషపడుతుంది. ఎండి సీట్లో నువ్వు ఉన్నప్పుడు, నీపై ఎలాంటి మచ్చ పడకూడదు. అందుకే, ఇలా ఆలోచించాను. నాకు రెండు ప్రాణాలు, రెండు బాధ్యతలు. మిషన్ ఎడ్యుకేషన్ డాడ్ నా బాధ్యత.

సెమిస్టర్ హాలిడేస్ అయ్యేదాకా, అన్ని సెట్ అవుతాయని ధైర్యం చెప్తాడు. మహేంద్ర మాత్రం జగతి ఫోటో దగ్గరే ఉంటాడు. ఇంటికి వచ్చిన దేవయాని, శైలేంద్ర, ఫణీంద్ర, రిషి వాళ్ళని ఇంటికి రమ్మని అడుగుతారు. అక్కడకి వచ్చేస్తే జాగ్రత్తగా చూసుకుంటాను రండి. పెద్దదాన్ని అప్పుడొక మాట అన్నాను. అది మనసులో పెట్టుకోవాలా..? ఇంకా మీ నాన్న గురించి ఆలోచించు అని దేవయాని అంటుంది. నేను ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నానంటాడు ఫణింద్ర. ఇక శైలేంద్ర కూడా డ్రామా ని స్టార్ట్ చేస్తాడు.

ఫైర్ అయిన మహీంద్ర, నేను రానని చెప్తున్నాను కదా.. నువ్వు పో.. అని శైలేంద్ర పై ఫైర్ అవుతాడు. దేవయాని అన్న మాటలు ని గుర్తు చేసిన మహేంద్ర ఇప్పుడు ఆ ఇంటికి ఎందుకు వెళ్లాలి జగతి అని అంటాడు. నువ్వు తాగుడు మానాలని అన్నాను అని దేవయాని అంటుంది. నాకోసం రా మహేంద్ర అని అంటాడు. డాడ్ అక్కడికి వస్తే, అమ్మ జ్ఞాపకాల్లోనే ఉంటారని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ అలాగే ఉన్నారు. దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్లాలి అనుకుంటున్నాను అని రిషి చెప్తాడు. నేను వస్తానని దేవయాని, ఇంకోవైపు శైలేంద్ర వస్తానంటారు.

ఫణీంద్ర ఫైర్ అవుతాడు. వాళ్ల మధ్య మీరెందుకు అని క్లాస్ ఇస్తాడు. వాళ్ళని ప్రశాంతంగా వదిలేయండి చాలు అనేసి, మహేంద్ర దగ్గరికి వెళ్తాడు. నువ్వు బాగుండాలని, నువ్వు చాలా మంచోడివి అని చెప్తాడు. జగతి చచ్చిపోయింది అన్నయ్య అని బాధ పడతాడు. రిషి, వసుధార, మహేంద్ర లాంగ్ టూర్ కి వెళ్తారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఒక చెట్టు కింద కూర్చుని జగతిని తలుచుకుంటూ మహేంద్ర తాగుతాడు. ఇంతలో ఒక కొత్త క్యారెక్టర్ మహేంద్ర అని పిలుస్తుంది. నువ్వా అని షాక్ అయిపోతాడు మహేంద్ర. ఆమె ఎవరో చూపించలేదు. కానీ, ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉండబోతుందని అర్ధమవుతోంది. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM