Guppedantha Manasu October 13th Episode : ఎండి ని ఎంపిక చేసే బాధ్యత, రిషి మీద పడుతుంది. రిషి తన పేరు సెలెక్ట్ చేస్తాడేమో అని శైలేంద్ర అనుకుంటాడు. కానీ, రిషి మాత్రం ఎండి బాధ్యతలని వసుధారకి అప్పగిస్తాడు. వసుధారకి క్షమాపణలు కూడా చెప్తాడు. అపార్థం చేసుకున్నందుకు క్షమాపణలు అడిగి, నీ చెయ్యి ఎప్పటికీ విడిచి పెట్టాను అని మాట ఇస్తాడు. ఇంకో వైపు ఎలా అయినా సరే కాలేజీ ఎండి సీట్ ని దక్కించుకోవాలని, శైలేంద్ర ఇంకో ప్లాన్ వేస్తాడు. ఎండి సీట్ లో కూర్చోవడానికి, రిషి సిద్ధంగా లేడు. మహేంద్ర తాగుడికి అలవాటు పడిపోయాడు. ఇద్దరు అడ్డు లేక పోవడంతో రిషి స్వయంగా, తనని ఎండి సీట్ లో కూర్చునేలా చేయాలని శైలేంద్ర అనుకుంటాడు.
ఎండి సీట్ విషయంలో ఎక్కడ నిర్ణయం మార్చుకుంటాడు అని శైలేంద్ర, దేవయాని కంగారు పడి పోతారు. ఇంకో సారి క్లారిటీ తీసుకుంటారు. రిషి మాత్రం ఎండి సీట్ లో కూర్చోవడానికి ఇష్టపడడు. ఇదివరకే తన నిర్ణయం చెప్పేశానని, అందులో మార్పు లేదని చెప్తాడు. ఎండి సీట్ లో ఎవరు కూర్చోవాలనే నిర్ణయం తీసుకో అని రిషి తో అంటాడు శైలేంద్ర. మేమందరం నువ్వే ఎండి కావాలని కోరుకుంటున్నాం. నువ్వేమో దీని గురించి ఆలోచించట్లేదు. మాకు నిన్ను బలవంతం చేసి ఆ సీట్ లో కూర్చో పెట్టించేస్తున్నామేమో అని అనిపిస్తోంది.
అయిష్టంగా పదవి చేపడితే పని చేయలేవు. ఇలా, రిషి తనకి అడ్డు రాకుండా మాటలతోనే మార్చేస్తాడు. శైలేంద్ర ఒక్కడే మన ఫ్యామిలీ నుండి రెడీగా ఉన్నాడని, సమర్థుడు, కష్టపడి పని చేస్తాడని రిషితో దేవయాని చెప్తుంది. ఎండి సీట్ లో కూర్చోవడానికి ఎవరు దొరకని టైం లో నేను కూర్చుంటాను, నాకు పదవులు ఇష్టం ఉండదు, కానీ, నీ కోసం, కాలేజీ బాగో కోసం ఎండి సీట్లో కూర్చుంటానని శైలేంద్ర అంటాడు. రిషి తో నువ్వు పోటీ పడటం కరెక్ట్ కాదు అని ఆ నాటకాన్ని ఇంకాస్త స్ట్రాంగ్ గా చేస్తుంది దేవయాని.
పైగా, కాలేజీ బాధ్యతలు తీసుకోవడం అంత ఈజీ కాదు. ఎంతో కష్టమని కొడుకుకి క్లాస్ పీకుతున్నట్లు రిషి ని నమ్మిస్తుంది. ఎండి సీట్ కోసం వేరొకరిని తీసుకోవాల్సి వస్తే, మన ఇంట్లో వాళ్ళని తీసుకోమని రిషికి చెప్తాడు శైలేంద్ర. నీ కోరిక ప్రకారం, మన ఇంట్లో వాళ్ళనే కూర్చోబెడతానని రిషి మాట ఇస్తాడు. తన మాటలతో ఆనంద పడిపోతారు శైలేంద్ర, దేవయాని. తానే నెక్స్ట్ ఎండి అని శైలేంద్ర అనుకుంటాడు. కొడుకుకి కంగ్రాట్స్ కూడా చెప్తుంది దేవయాని. ఎండి సీట్ లో కూర్చున్నాక గ్రాండ్ పార్టీ చేసుకోవాలని అనుకుంటుంది.
అప్పుడే అక్కడికి వసుధార వస్తుంది. ఎండి సీట్ ని ఎవరికి అప్పగించాలనే విషయం లో సరైన నిర్ణయం తీసుకోమని రిషికి చెప్తుంది వసుధార. రిషి మంచి నిర్ణయమే తీసుకుంటాడని భర్తకి సపోర్ట్ చేస్తుంది వసుధార. శైలేంద్ర ఏదో కొత్త ప్లాన్ వేశాడని కనిపెడుతుంది వసుధారా. రిషి అక్కడినుండి వెళ్ళిపోగానే, కాలేజ్ రిషిదే అని దేవయాని, శైలేంద్ర తో అంటుంది. ఎండి పదవి శైలేంద్ర కి ఇస్తే మంచిదని, అప్పుడు గొడవలు రావని వసుధారతో అంటుంది దేవయాని. అది అసాధ్యమని వసుధార ఆమెకి బదులిస్తుంది.
కాలేజీ వ్యవహారాలు నీకు అనవసరం. పంతాలు, పట్టింపుల కి పోవడం మంచిది కాదని వసుధారాని భయ పుడుతుంది దేవయాని. ఎండి సీట్ లో కూర్చునే అర్హత రిషికి మాత్రమే ఉందని వసుధార గట్టిగా సమాధానం చెబుతుంది. పిన్ని చనిపోయినట్లే రిషి కూడా చనిపోతాడేమోనని ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర.. ఇటువంటి వాటిని వదిలేసి, దూరంగా ప్రశాంతంగా బతకండి అని బెదిరిస్తాడు. తన స్నేహితుడు గేటెడ్ కమ్యూనిటీ సిటీ బయట కడుతున్నాడని, అక్కడికి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అని శైలేంద్ర మీద రివర్స్ పంచ్ ఇస్తుంది వసుధార.
మీ బెదిరింపులకు భయపడేది లేదని చెప్తుంది. రోజులు దగ్గర పడుతున్నాయి. మీకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం దొరికినా చాలు. ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో ఊహించుకోండి అని దేవయాని శైలేందర్ల తో వసుధార చెప్తుంది. చాలా రోజుల తర్వాత కాలేజీ లోకి అడుగుపెడతాడు రిషి. ఘనంగా ఆహ్వానం పలుకుతారు. ఎండిగా రిషి ఉండాలని స్టూడెంట్స్ నినాదాలు చేస్తారు. ఫనీంద్ర, వసుధర వాళ్ళ అభిమానాన్ని చూసి సంతోషపడతారు.
శైలేంద్ర, దేవయాని ముఖాలు మాడిపోతాయి. సీక్రెట్ కవర్లో తన పేరు రాసాడని శైలేంద్ర సంబరపడిపోతాడు. మినిస్టర్ కవర్ ఓపెన్ చేసి, పేరు చెప్పక ముందే లేచి శైలేంద్ర నిలబడిపోతాడు. వసుధార పేరు ప్రకటిస్తారు మినిస్టర్. వసుధర పేరు విని , శైలేంద్ర, దేవయాని షాక్ అయిపోతారు. రిషి ఎండిగా తనని సెలెక్ట్ చేశాడని వసుధార ఆశ్చర్య పోతుంది. తను నా భార్య అని, ఎండి సీట్ లో కూర్చో పెట్టట్లేదు. తనకి అర్హత ఉందని, ఈ బాధ్యతని అప్పగిస్తున్నాను అని చెప్తాడు రిషి. ఇప్పటితో, ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…