వినోదం

Guppedantha Manasu December 20th Episode : రిషిని కలవడానికి వసుధార.. అవమానాన్ని తట్టుకోలేకపోతున్న దేవయాని..!

Guppedantha Manasu December 20th Episode : వసుధార ప్యూన్ ని పిలిచి, శైలేంద్ర వాళ్లని మెడ పట్టుకుని బయటికి గెంటేయమని వసుధారా చెప్తుంది. తను రావడానికి భయపడుతుంటే, నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానని, హామీ ఇస్తున్నా అనేసరికి ముందుకు వస్తాడు. శైలేంద్ర వాడిని ఆపి వెళ్ళిపోదాం పద అంటాడు. ఇంకోసారి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకుని రావాలని తెలుసుకోండి అని అంటుంది. ఈ సీటుని శానిటైజర్ తో క్లీన్ చేయమని, అడ్డమైన వైరస్ లు వస్తున్నాయని చెప్తుంది. అది విని దేవయాని కోపంగా వెళ్లబోతుంటే, ఇక్కడ వసుధారా కి పట్టు ఉందని నచ్చచెప్పి తీసుకెళ్తాడు.

మహేంద్ర అనుపమ కాలేజ్ లో ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటారు. మహేంద్ర డల్ గా ఉండడం చూసి, ఏమి ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. జగతి, నేను ఇక్కడే కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. ఎప్పుడూ కూడా స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఆలోచించేది. కాలేజ్ ని నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉండేది. ఇంట్లో భార్యగా, కాలేజ్ కి వచ్చాక ఫ్రెండ్ గా మాట్లాడేది. అంత గొప్ప బంధం ఉంది. కనుక తనని మర్చిపోలేక పోతున్నానని బాధపడతాడు. జగతి గురించి గొప్పగా చెబుతున్నారు. వాళ్ళందరూ అలా చెప్తుంటే చాలా సంతోషంగా గర్వంగా ఉంది అని మహేంద్ర చెప్తాడు.

ఇన్ని రోజులు జగతి లేదు. తన చావుకి కారణం ఎవరో కనుక్కుందామని అనుకున్నాను. కానీ, ఇప్పుడు రిషి కనపడకుండా పోయాడు. కట్టుకున్న భర్త కనపడక పోయేసరికి, తల్లడిల్లి పోతోంది వసుధారా. అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండే వసు, రిషి విషయంలో మాత్రం ఎందుకలా భయపడుతోంది? ఏదో ఒకటి చేయాలని అనుపమ అంటుంది. వసు బాధను దూరం చేయాలనే కదా, ముకుల్ తో మాట్లాడాలని అంటాడు. ఏనాటికైనా రిషి వసు కలుస్తారు. అదే తన ఆశ అని చెప్తాడు. తల్లికి శైలేంద్ర ధైర్యం చెప్తాడు.

Guppedantha Manasu December 20th Episode

వసు అంతకంతకు భయపడేలా చేస్తానని మాట ఇస్తాడు. రిషి కనిపించకపోయినా, తాను భయపడలేదని, మనల్ని చూసి, అది కాస్త కూడా తొనకడం లేదని అంటుంది. మెడ పట్టుకుని గెంటేస్తే ఏం బాగుంటుంది అని అంటాడు. చివరికి అటెండర్ కి కూడా భయపడుతున్నావని దేవయాని తిడుతుంది. చూస్తూ ఉండు వసుధార మెడ పట్టుకొని బయటకి గెంటేస్తానని చెప్తాడు. మిమ్మల్ని కూడా, మెడ పట్టుకుని గెంటేస్తారని చెప్తే విన్నారా..? నేను వెళ్ళినట్లయితే ఇలా జరిగేది కాదు కదా అంటుంది.

మొత్తం విన్నావా అని అడుగుతాడు. అవును విన్నానని అమాయకంగా చూస్తుంది ధరణి. వాళ్ళకి కౌంటర్ వేసి వెళ్ళిపోతుంది. వసుధార చేసిన అవమానం కంటే, ధరణి చేస్తున్న అవమానం తట్టుకోలేకపోతున్నాను దేవయాని అంటుంది. సీటు కోసం మౌనంగా ఉంటున్నానని అంటాడు. ఇప్పుడు నేను వేసే అడుగు చాలా భయంకరంగా ఉండబోతుంది, నీ కళ్ళ ముందు ఏం జరిగినా నువ్వు భయపడకు. ధైర్యంగా వుండు అంటాడు. వసుధార నోరు మూయిస్తాను.

నేను చెప్పే మాటలు వసు నోటి నుండి అందరి ముందు పలికేలా చేస్తానని అంటాడు. కాలేజీలో బోర్డు మీటింగ్ మొదలవుతుంది. దేవయాని వస్తే, అందరూ తనకి గుడ్ మార్నింగ్ చెప్తారు. ఫణింద్ర దేవయానని ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. నిన్ను ఎవరు పిలవలేదు కదా..? ఎందుకు వచ్చావు అని అంటాడు. పెద్ద మీటింగ్ అని తెలిసి వచ్చానని అంటుంది. ఇంట్లో చేస్తున్నది చాలక, కాలేజీలో కూడా మనసు పాడు చేయడానికి వచ్చావా అని, తిడతాడు. వసుధార ఇంకా రాలేదా అని అంటుంది.

బోర్డు మెంబర్స్ టైం అంతా వేస్ట్ అవుతుంది. వసుధార అసలు ఎక్కడ ఉంది? రాదా అని అడుగుతుంది. వసుధార బయలుదేరిపోతుందిగా ఒక వ్యక్తి కొరియర్ వచ్చిందని చెప్పి పార్సెల్ ఇస్తాడు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో రిషి చేతికి గతంలో వసు పెట్టిన బ్రేస్ లేట్ ఉంటుంది. నువ్వు నీ భర్తని కలవాలి అనుకుంటే, వెంటనే నేను చెప్పిన అడ్రస్ కి ఎవరికీ చెప్పకుండా రా అని చెప్తారు. ఇప్పుడు ఈ విషయం ఎవరికైనా చెప్పినా లేట్ చేసిన నీ భర్తని నువ్వు జన్మలో చూడలేవని ఉత్తరం ఉంటుంది. ముందు ఈ అడ్రెస్ కి వెళ్లాలని, సార్ ని చూడాలని వసుధారా బయలుదేరుతుంది.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM