వినోదం

Guppedantha Manasu December 11th Episode : ముకుల్‌ కి చెక్ పెట్టిన శైలేంద్ర.. శైలేంద్ర మాస్టర్ ప్లాన్ కి దేవయాని హ్యాపీ..!

Guppedantha Manasu December 11th Episode : నేరం ఒప్పుకున్న శైలింద్రని, పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లడానికి ముకుల్ రెడీ అవుతాడు. శైలేంద్ర తన ఫోన్ తీసుకురమ్మని దేవయానికి చెప్తాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే టైంలో, తనకి ఫోన్ వచ్చింది అని చెప్పి కాల్ రికార్డింగ్ వాయిస్ ని వినిపిస్తాడు. జగతి మేడం మర్డర్ కేసు నుండి మిమ్మల్ని తప్పిస్తానని, అందుకోసం 50 లక్షలు ఇవ్వాలని శైలేంద్ర ముకుల్ ని కోరినట్లుగా, ఆ వాయిస్ రికార్డింగ్ లో ఉంటుంది. డిస్కషన్ ఏమీ లేకుండా పంపించిన అకౌంట్ నెంబర్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని, డిమాండ్ చేసినట్లుగా వాయిస్ రికార్డింగ్ లో ఉంది. ఆ వాయిస్ రికార్డింగ్ విని ముకుల్ తో పాటు అనుపమ వసుధార మిగిలిన వాళ్ళు షాక్ అయిపోతారు.

ఆ వాయిస్ నాది కాదు అని అంటాడు ముకుల్. అదంతా ఫ్రాడ్ అని అంటాడు. సేమ్ మీ వాయిస్ లాగే ఉందని వాదిస్తాడు శైలేంద్ర. ఇందాక మీరు వినిపించిన వాయిస్ నాదే అయినప్పుడు నేను వినిపించిన వాయిస్ మీది ఎందుకు కాదని అడుగుతాడు. శైలేంద్ర నేను మీకు అసలు ఫోన్ చేయలేదని, శైలేంద్రతో అంటాడు ముకుల్. నేను కూడా షూటర్ కి ఫోన్ చేయలేదని, ముకుల్ కి బదులిస్తాడు. శైలేంద్ర ఒక వాయిస్ ని క్రియేట్ చేయడం లెక్క అని ముకుల్ కి చెక్ పెడతాడు. పేషెంట్ అని కూడా చూడకుండా అనుమానిస్తూ ప్రశ్నలు అడగడం కరెక్ట్ కాదని ముకుల్ మీద రివర్స్ అటాక్ చేస్తాడు.

పిన్ని హత్య కేసులో నన్ను నిందితుడిని చేస్తే, నాకు ఎంత బాధ కలుగుతుందో ఊహించారా అని ఎమోషనల్ అయిపోతాడు. తల్లిలా భావించే పిన్ని చావుకి నేను కారణం అని, నా తండ్రి నాపై చేయి చేసుకున్నాడని, అప్పుడే నా గుండె ముక్కలు అయిపోయిందని మొదలు పెడతాడు. నా కొడుకు అలాంటి తప్పులు చేయడు. అలాంటివాడు కాదు అని నువ్వు ఎందుకు చెప్పలేకపోయావని, దేవయానిని శైలేంద్ర అడుగుతాడు నేను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని దేవయాని అంటుంది.

Guppedantha Manasu December 11th Episode

పిన్ని హత్య కేసులో నన్ను అనుమానించేటప్పుడు అందరూ నన్ను చంపేశారని శైలేంద్ర అంటాడు. సిమ్ అసలు నా పేరు మీద లేనప్పుడు, నేను ఎలా కిల్లర్ తో మాట్లాడుతాడని, ముకుల్ అడుగుతాడు. శైలేంద్ర తను హాస్పిటల్ లో ఉండగా, అతనికి ఇంకో కాల్ వచ్చింది అని చెప్పి, ఇంకో వాయిస్ వినిపిస్తాడు శైలేంద్ర. అన్నయ్య నీ చాప్టర్ క్లోజ్ అయినట్లేనని రిషి వాయిస్ అందులో ఉంటుంది. నీ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఎండీ సీట్ లో వసుని కూర్చోబెట్టాలని అనుకున్నప్పుడు, అమ్మ అడ్డుగా వచ్చింది. వెంటనే అమ్మ అడ్డుని తొలగించి వసుధారని కూర్చోబెట్టాను.

ఫ్యూచర్లో నీ నుండి ఎలాంటి అడ్డంకి ఉండకూడదని నీ మీద ఎటాక్ చేయించాను కానీ మిస్ అయింది. త్వరలోనే నిన్ను కూడా ఫినిష్ చేస్తా అని వాయిస్ వినిపిస్తాడు. రిషి అలాంటివాడు కాదు అని మహేంద్ర ఆవేశంగా అంటాడు. నాకు తెలుసు బాబాయ్ నా తమ్ముడి క్యారెక్టర్ ఏంటో ఇదంతా అబద్ధం అని మన ఫ్యామిలీపై పగతో ఎవరో చేస్తున్నారని అంటాడు శైలేంద్ర. నా వాయిస్ విని నన్ను అందరూ అనుమానించారు. సొంత కొడుకు అయితే ఒక లెక్క. అన్న కొడుకు అయితే ఒక లెక్క అని మహేంద్రని నిలదీస్తాడు శైలేంద్ర. చెయ్యని తప్పుకి నన్ను దోషిని చేసి అయిన వాళ్లే నన్ను అనుమానిస్తున్నారని శైలేంద్ర బాధపడతాడు.

రిషి ఎక్కడున్నాడో ఏంటో..? అసలు బతికున్నాడా లేదా అని శైలేంద్ర ఏదో చెప్పబోతుంటే వసుధార మధ్యలో అడ్డుకుంటుంది. ఏం మాట్లాడుతున్నారు. బుద్ధుండే మాట్లాడుతున్నారా? రిషి బతికే లేడని తెలిస్తే ఎవరిని వదిలి పెట్టనని శైలేంద్ర కి వార్నింగ్ ఇస్తుంది వసుధారా. నేనేమీ అనలేదు. నామీద అటాక్ చేసిన రౌడీలు కుటుంబంలో ఎవరిని వదిలిపెట్టనని అన్నారని. శైలేంద్ర మళ్ళీ డ్రామా మొదలు పెడతాడు. అందుకు ధరణి సాక్ష్యం అని చెప్తాడు.

ఎవరు ఈ కేసుని పక్క దారి పట్టిస్తున్నారో అర్థమవుతుంది కచ్చితంగా వాళ్ళని పట్టుకుంటానని ముకుల్ అంటాడు. శైలేంద్ర ట్విస్ట్ కి అందరూ షాక్ అవుతారు. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని తప్పించుకున్నా, ఏదో ఒక రోజు శైలేంద్ర నిజ స్వరూపం అందరికీ తెలుస్తుందని మహేంద్ర అంటాడు. శైలేంద్ర ఆలోచనకి దేవయాని మురిసిపోతుంది. నా ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయి. అందుకే ఇన్ని నేరాలు చేసినా బయటపడలేదని తల్లితో అంటాడు. శైలేంద్ర ఇలాంటి విషయాల్లో నువ్వే నా గురువు అని తల్లితో చెప్తాడు.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM