వినోదం

Sridevi : శ్రీదేవి హిట్ సినిమాల గురించి అందరికీ తెలుసు.. కానీ విడుదల కాని ఈ 4 సినిమాల గురించి తెలుసా..?

Sridevi : శ్రీదేవి దక్షిణాదిన అన్ని భాషల్లో నటించి బాలీవుడ్‌లో తన సత్తా చాటి లేడీ సూపర్ స్టార్ హోదాని సొంతం చేసుకుంది. అందం, అభినయం కలగలిపిన శ్రీదేవి తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో 270 సినిమాలు చేసింది. శ్రీదేవి ఉంటే చాలు హిట్ అవుతుందనే మ్యాజిక్ మంత్రం అప్పట్లో బాగా ఉండేది. దాంతో అటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు ప్రేక్షకులు కూడా ఆ సినిమాల మీద అంచనాలు పెట్టుకునేవారు. అయితే శ్రీదేవి నటించిన కొన్ని సినిమాలు విడుదల అవ్వలేదనే విషయం మీకు తెలుసా. కొన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చి, మరికొన్ని షూటింగ్ పూర్తి చేసినప్పటికీ ప్రేక్షకుల వరకు రాలేదు. ఇంతకీ ఆ సినిమాలేవో తెలుసా.

1988లో డైరెక్టర్ రమేష్ సిప్పీ వినోద్ ఖన్నా, శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లతో జమీన్ సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. సినిమాలో కొంత భాగం కూడా చిత్రీకరించారు. తరువాత ఆగిపోయింది. ఇది పూర్తయితే శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లు కలసిన నటించిన తొలి సినిమా అయ్యేది. రమేష్ సిప్పి 1991లో శ్రీదేవి, వినోద్ ఖన్నా, రుషి కపూర్‌లతో గర్జన పేరుతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. ట్రైలర్ రిలీజ్ అయినా సినిమా షూటింగ్ జరగలేదు. స్టార్‌కాస్ట్ విషయంలో వివాదం చోటుచేసుకోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం.

Sridevi

డైరెక్టర్ అనిల్ శర్మ 1990లో అనిల్ కపూర్, శ్రీదేవితో మహారాజ్ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. కారణం తెలియదు కానీ ఈ సినిమా నిర్మాణం ఆగిపోయింది. 1996లో అనిల్‌కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను, శ్రీదేవి కలిసి గోవిందా అనే సినిమాలో నటిస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి ఫొటోషూట్ అయినప్పటికీ సినిమా చిత్రీకరణ జరగలేదు. అప్పట్లో ఆగిపోయిన తన సినిమాల గురించి శ్రీదేవి బాధపడేది కాదట. ఎందుకంటే వాటి గురించి ఆలోచించే తీరిక ఆమెకి ఉండేది కాదని బాలీవుడ్ మీడియా ఓ కథనంలో తెలిపింది. నిజమే కదా బాలనటిగా ఉన్నప్పుడే రోజుకు మూడు షిప్టులు పనిచేసేదని చెప్తుంటారు. ఇక సూపర్ స్టార్ అయ్యాక తన పరిస్థితిని అర్దం చేసుకోవచ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM