Dhootha Trailer : అక్కినేని ఫిల్మ్ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా చాలా వాటిలోనూ రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు నాగ చైతన్య. ఆ మధ్య వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టిన అతడు.. కొంత కాలంగా ఫ్లాపుల పరంపరతో ఇబ్బంది పడుతున్నాడు. అయినప్పటికీ ఎన్నో ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రయోగాలు చేస్తోన్న నాగ చైతన్య.. సినీ రంగంలో తనదైన మార్కును చూపిస్తున్నాడు. తాజాగా ‘ధూత’ అనే వెబ్ సిరీస్‌ను చేశాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ నిర్మించింది.
దూత డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా నవంబర్ 23న చైతూ పుట్టినరోజు సందర్భంగా దూత ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. మనం ఇలాంటి క్లాసిక్ సినిమాను తెరకెక్కించిన విక్రమ్ కే కుమార్ దీనికి దర్శకుడు. సినిమాల పరంగా వరుసగా నిరాశ పరుస్తున్న విక్రమ్.. దూత వెబ్ సిరీస్ తో కచ్చితంగా ఆకట్టుకుంటాడని నమ్ముతున్నారు అక్కినేని అభిమానులు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే జర్నలిజం నేపథ్యంలో ఈ దూత సిరీస్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక జర్నలిస్టుగా నటించాడు నాగచైతన్య. అనుకోకుండా మర్డర్ కేసులో ఆయన ఇరుక్కోవడం.. అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు.. ఈ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో దూత వెబ్ సిరీస్ తెరకెక్కింది. చూస్తుంటే కచ్చితంగా ఈ సిరీస్ తో చైతూ డిజిటల్‌లో కూడా తనదైన మార్క్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు.
ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను డిసెంబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. వరుసగా జరుగుతున్న హత్యలకు, హీరో పాత్రకు సంబంధం ఏంటి? అసలు పేపర్లో వచ్చిన కార్టున్ స్టోరీలా హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? అనే అంశాలను సస్పెన్స్‌గా ఉంచి ‘ధూత’ సిరీస్‌పై అంచనాలు పెంచేశారు. ఇక, ఈ ట్రైలర్‌లో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ టాప్ రేంజ్‌లో ఉన్నాయి. అలాగే, నాగ చైతన్య లుక్స్ కూడా పాత్రకు తగ్గట్లుగానే ఉన్నాయని చెప్పాలి. మొత్తానికి ఈ ట్రైలర్‌కు విశేషమైన స్పందన వస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…