వినోదం

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో ‘డీమాంటీ కాలనీ’ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ… తెలుగులోనూ ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాతో అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొమ్మిదేళ్ల తర్వాత ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్ తీశారు. తొలుత వేరే దర్శకుడిని అనుకున్నా… చివరకు అజయ్ ఆర్ జ్ఞానముత్తు ప్రాజెక్టులోకి వచ్చారు. అరుళ్ నిధి మరోసారి హీరోగా నటించారు. ఈసారి ఆయన డ్యూయల్ రోల్ చేయగా… ప్రధాన పాత్రలో ప్రియా భవానీ శంకర్ నటించారు. తమిళంలో ఆగస్టు 15న థియేటర్లలో విడుదల అయ్యింది. వారం ఆలస్యంగా ఆగస్టు 23న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి స్పందన లభించింది.

దాదాపు కథలో మెయిన్ పాయింట్ ఒకేలా ఉన్నా.. వాటి చుట్టూ రాసుకొన్న పాత్రలు, ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రేమ కథ, కుట్రలు, మోసాలు లాంటి అంశాలు చక్కగా తెర మీద చెప్పాలనే ప్రయత్నంలో మరోసారి సక్సెస్ అయ్యారు ద‌ర్శ‌కుడు. తనకు అత్యంత బలంగా మారిన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుడికి ఊపిరి సలపకుండా భావోద్వేగాలతో కట్టిపడేశాడు. అలాగే టెక్నికల్ అంశాలతో థియేటర్లలో ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురి చేశాడని చెప్పవచ్చు. రకారకాల ట్విస్టులు, టర్న్‌లతో సినిమాను ఆద్యంతం పట్టుసడలకుండా కథను నడిపించిన విధానం ఆయన ప్ర‌తిభ‌కి అద్దం ప‌ట్టింది అని చెప్పాలి.

ఈ సినిమాని ఓటీటీలో చూడాల‌ని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఎట్టకేల‌కి డేట్ అనౌన్స్ చేశారు. ఈ నెల 27 నుండి తెలుగు, త‌మిళ భాష‌ల‌లో జీ5లో డీమోంట్ కాల‌నీ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రం థియేట‌ర్స్‌లో మంచి రెస్పాన్స్ ద‌క్కించుకొని రూ.50 కోట్ల‌కి పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది.’డీమాంటీ కాలనీ 2’లో అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తు కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజ్ వర్మ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ బాలాజీ ఫిలింస్ సంస్థలు నిర్మించాయి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM