Curry And Cyanide OTT : థియేటర్స్ లో సినిమాలను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ఎంతో ఆసక్తిని చూపుతున్న విషయం తెలిసిందే. బడా హీరోల సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటి చిత్రం ఒకటి ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది.ముఖ్యంగా ఎక్కువ మంది ఎంతో ఇష్టపడే అద్భుతమైన థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో తెగ సందడి చేస్తుండగా, తాజాగా ఓ అద్భుతమైన రియల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఓటీటీలోకి వచ్చేసింది. అప్పట్ల కేరళలో జరిగిన ఓ రియల్ క్రైమ్ స్టోరీని చాలా మంది సినిమాగా మలిచారు.
కేవలం సినిమాగానే కాకుండా డాక్యుమెంటరీగా, సీరియల్ గా కూడా రూపొందించడం మనం చూశాం. వీటికి సంబంధించి చిత్రాలు కూడా ప్రేక్షకు ముందుకు వచ్చాయి. ఇప్పుడు డాక్యుమెంటరీ వచ్చింది. అదే జూలీ జోసెఫ్ కథ. అయితే కళలోని కోజికోడ్ కూడతాయి గ్రామానికి చెందిన ఆమె 14 సంవత్సరాల్లో మొత్తం ఆరు హత్యలు చేసింది. తన కుటుంబ సభ్యులనే తాను అలా హత్య చేయడం… అప్పట్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆమె ఆరు హత్యలకు ఎలా పాల్పడిందో తెలుసుకుని అంతా అవాక్కయ్యారు.అన్నింటిని ఆమె అనుమానాస్పద మృతులుగా కట్టుకథలు అల్లింది.
జూలీ జోసెఫ్ తన అత్తయ్యను, మామయ్యను, ఆతర్వాత ఆమె భర్త రాయ్ థామస్, ఆతర్వాత తన అత్తయ్య సోదరుడు మాథ్యూ, తన భర్త దగ్గరి బంధువైన షాజు జచారయ్య భార్య, ఏడాదిన్నర బిడ్డను చంపేసింది . ఆతర్వాత షాజు జచారయ్యను రెండో వివాహం చేసుకుంది. అయితే జూలీ జోసెఫ్ భర్త సోదరుడు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆస్తి తనకు దక్కాలన్న అత్యాశతోనే అందరిని చంపిన జూలీ జోసెఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కర్రీ అండ్ సైనైడ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. డిసెంబర్ 22వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా, మిస్ అయిన వారు తప్పక ఈ వెబ్ సిరీస్ చూసి ఎంజాయ్ చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…