Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటుడిగానే కాదు మంచి మనసున్న మనిషి కూడా. ఆయనని చాలా మంది చాలా సార్లు చాలా రకాలుగా మాట్లాడిన కూడా వారికి తన సపోర్ట్ అందించారు. తాజాగా చెన్నై చంద్రం త్రిషకి తన సపోర్ట్ అందించి మరోసారి దటీజ్ మెగాస్టార్ అని నిరూపించుకున్నారు. చిరంజీవి ఇటీవలి కాలంలో నటించిన ఆచార్య చిత్రంలో త్రిషని హీరోయిన్ అని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన త్రిష సినిమా చేయనని అన్నది . అయితే చిరంజీవి హర్ట్ అయినట్టు అప్పుడు ప్రచారం జరిగింది. అయితే అప్పుడు చిరంజీవి.. త్రిష వలన హర్ట్ అయిన కూడా ఆమెకు తన సపోర్ట్ అందించాడు.
మన్సూర్ అలీ రీసెంట్‌గా త్రిషపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. మన్సూర్ చేసిన వ్యాఖ్యలు ఆర్టిస్ట్‌కు మాత్రమే కాదు, ప్రతి ఒక్క మహిళకి కూడా అసభ్యకరంగా, అసహ్యంగా ఉన్నాయి. ఈ వాఖ్యలను తీవ్రంగా ఖండించాల్సిందే. వారు ఇలాంటి వక్రబుద్దితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయంలో నేను త్రిషకు అండగా నిలబడతా. కేవలం త్రిషకి మాత్రమే కాదు, ఇలాంటి అసభ్యకరమైన, భయంకరమైన వ్యాఖ్యలకు సంబంధించి ప్రతి స్త్రీకి మద్దతుగా నేను ఉంటాను అంటూ సోషల్‌మీడియాలోని తన ఖాతాలో మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేయడం జరిగింది. చిరంజీవి చేసిన ట్వీట్‌తో ఈ వివాదం మరింత వేడెక్కింది.

వివాదం విషయానిఇక వస్తే తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ‘లియో’ మూవీపై మాట్లాడుతూ.. లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని నాకు తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్న అయితే త్రిషతో నేను చేసే సన్నివేశాలలో ఒక్క సన్నివేశం అయినా బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నా. నా మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. నేను ఇంతకుముందు చాలా సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. రేప్ సీన్లు నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదు. అంటూ మన్సూర్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై త్రిష కూడా స్పందించారు. ఇలాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తితో కలిసి పనిచేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను అంటూ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.