నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగారు. ఒకపక్క ఇండస్ట్రీలో రామారావు, నాగేశ్వరరావు ఓ వెలుగు వెలుగు వెలుగుతున్న సమయంలోనే కొణిదెల శివకుమార్ అనే కుర్రాడు మొగల్తూరు నుంచి మద్రాసులో అడుగుపెట్టి నేడు మెగాస్టార్ గా ఎదిగాడు. చిరు ఇప్పటికి 150కి పైగా సినిమాల్లో నటించాడు. సినీ డాన్సుకి డెఫినేషన్ చెప్పిన నటుడు చిరంజీవి. యాక్టింగ్ లో చిరు ఈజ్, డాన్స్ లో ఆయన చరిష్మా ఎవరికి రాదనే చెప్పవచ్చు. చిరంజీవి నట ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ ఏఎన్నార్ తో కూడా చిరంజీవి సినిమాలు చేశారు.
అక్కినేని నాగేశ్వరరావుతో చిరంజీవి మెకానిక్ అల్లుడు అనే సినిమాలో నటించారు. అంతేకాకుండా ఎన్టీ రామారావుతో తిరుగులేని మనిషి సినిమాలో నటించారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తో మరో సినిమా చేసే అవకాశం కూడా చిరంజీవికి వచ్చింది. కానీ 5 రోజుల షూటింగ్ తర్వాత చిరంజీవి స్థానంలో మోహన్ బాబును తీసుకున్నారు. ఆ సినిమా ఏంటి మెగాస్టార్ ను ఎందుకు తీసేసారు అంటే.. ఎన్టీఆర్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కొండవీటి సింహం సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొడుకు పాత్ర కోసం మొదట చిరంజీవిని తీసుకున్నారు. అయితే సినిమాలో ఎన్టీఆర్ కొడుకుగా నటించిన చిరంజీవి ఆయనను ఎదిరిస్తూ పవర్ ఫుల్ డైలాగులు చెప్పాల్సి ఉంటుంది.
చిరంజీవి కూడా పాత్రకు ఒప్పుకున్నారు. 5 రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది. అయితే ఎన్టీఆర్ ను ఎదిరిస్తూ డైలాగులు చెప్పేందుకు చిరంజీవి తడబడ్డారు. దానికి కారణం ఎన్టీఆర్ అప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరో గా ఉన్నారు. కానీ చిరంజీవి అప్పుడప్పుడే కెరీర్ ను గాడిలో పెట్టుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ ఆ సినిమా కోసం కేవలం 30 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారు. దాంతో షూటింగ్ ఇలాగే జరిగితే కష్టమని మేకర్స్ భావించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి స్థానంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబును తీసుకున్నారు. అలా మోహన్ బాబు ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో మోహన్ బాబు ఎన్టీఆర్ తో పోటీగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…