Calling Sahasra OTT Release : బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా సత్తా చాటుతున్నాడు. ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పలువురు నిర్మాతలు సుధీర్‌తో సినిమాలు చేసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఆయనతో రీసెంట్‌గా కాలింగ్ సహస్ర అనే సినిమా చేశారు.గాలోడు సక్సెస్ తర్వాత ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న సుడిగాలి సుధీర్ క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రం చేశాడు. ఈ మూవీకి అరుణ్ విక్కీరాలా దర్శకత్వం వహించాడు. యానిమల్‌తో పాటు డిసెంబర్ 1న కాలింగ్ సహస్ర రిలీజైంది. అయితే యానిమల్ ఎఫెక్ట్ కాలింగ్ సహస్రపై భారీగానే పడింది. గాలోడు మ్యాజిక్‌ను రిపీట్ చేయలేక బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డీలా పడింది.
థియేటర్ దగ్గర పెద్దగా సందడి చేయలేకపోయిన కాలింగ్ సహస్ర చిత్రం డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్నట్లు తెలిసింది. జనవరి 1న కాలింగ్ సహస్ర ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ అయితే రానుంది. సుధీర్‌కి బుల్లితెరతో పాటు వెండితెర ప్రేక్షకులలోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఈ క్రమంలో కాలింగ్ సహస్ర స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ ధరకు దక్కించుకున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో డాలీషా హీరోయిన్‌గా నటించగా, శివబాలాజీ కీలక పాత్ర పోషించాడు.
చిత్ర కథ విషయానికి వస్తే.. అజయ్ శ్రీవాస్తవ (సుడిగాలి సుధీర్) ఓ సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్. బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ మీద వస్తాడు. సిటీకి వచ్చిన తర్వాత ఓ కొత్త సిమ్ తీసుకుంటాడు. ఆ సిమ్ తీసుకున్న రోజు నుంచి అతడికి అనుకోని కాల్స్ వస్తూనే ఉంటాయి. అతని ఫోన్ నుంచి అతనికే మెసేజ్‌లు రావడం అతనికి ఏం అర్ధస్తుంది. ఆ మెసేజెస్ ఏంటి.. ఎక్కడ్నుంచి వస్తున్నాయి.. దాని కథేంటో తెలుసుకోవాలని వెళ్లి ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అసలు ఈ కేసు ఏంటి, ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డారు అనేది మిగిలిన కథ.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…