వినోదం

Brahmanandam : సీనియ‌ర్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..!

Brahmanandam : సినిమాల్లో కమెడియన్స్ కి చోటు ఉంటుంది కానీ బ్రహ్మానందం లేకపోతే ఆ సినిమాకు వెళ్లడం అనవసరం అనేంతగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న కమెడియన్ బ్రహ్మానందం ఏకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు. బ్రహ్మానందం తెరపై కనిపిస్తే చాలు నవ్వుకునే ఆడియన్స్ చాలామంది ఉన్నారు. అంతలా తన హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తూ స్టార్ కమెడియన్ అయ్యాడు. తాజాగా జాతిరత్నాలు మూవీతో మళ్ళీ ఆడియన్స్ కి కనిపించాడు. ఇతడిని బ్రహ్మి, జఫ్ఫా బ్రహ్మి అని కూడా పిలుస్తారు. 1956 ఫిబ్రవరి 1న కన్నెగంటి నాగలింగాచార్య, లక్ష్మీనర్సమ్మ దంపతులకు 7వ సంతానంగా జన్మించిన బ్రహ్మానందం ప్రస్తుతం 67 ఏళ్ల వయస్సులో ఉన్నాడు.

ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం చాగంటి వారిపాలెంలో జన్మించిన బ్రహ్మానందం స్కూల్ విద్య సత్తెనపల్లి సురభయ్య హైస్కూల్ లో, కాలేజీ విద్య భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో పూర్తి చేశాడు. టెన్త్ ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. ఎంఏ తెలుగు చేసిన బ్రహ్మానందం పెళ్లి పెద్దల ఆశీర్వాదంతో లక్ష్మితో అయింది. వీరికి రాజా గౌతమ్, సిద్ధార్ద్ అనే ఇద్దరు కుమారులున్నారు. తండ్రి నాటకాల్లో వేయడం వలన ఇతడికి కూడా నాటకాలంటే ఇష్టం ఉండేది. ఫ్రెండ్స్ ముందు కామెడీ చేసేవాడు. దూరదర్శన్ లో పకపకా అనే ప్రోగ్రాం లో చేశాడు. జంధ్యాల డైరెక్ట్ చేసిన అహ నా పెళ్ళంట మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం ఆ సినిమాలో అర గుండు బ్రహ్మానందం క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. 1987లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

Brahmanandam

తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు 6వేల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవికి బ్రహ్మానందం క్యారెక్టర్ నచ్చడంతో పసివాడి ప్రాణం మూవీలో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు.1994లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డు, 2003లో బెస్ట్ మేల్ కమెడియన్ గా, 2009లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. ప్రస్తుతం రూ.1 కోటి నుంచి రూ. 1 కోటి 50 లక్షల వరకూ రెమ్యున‌రేష‌న్‌ అందుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఇష్టమైన హీరోలు. మహానటి సావిత్రి ఇష్టమైన హీరోయిన్. వైజాగ్ అంటే ఇష్టం. డ్రాయింగ్ అండ్ యాక్టింగ్ ఇష్టం. ఇతడికి మూడు ఖరీదైన కార్లు ఉన్నాయి. దాదాపు రూ.350 కోట్ల ఆస్తులు కలిగిన బ్రహ్మానందం హైదరాబాద్ మణికొండలో పంచాయితీ ట్రావెల్స్ లో దాదాపు రూ.7 కోట్ల విలువైన ది ట్రయల్స్ విల్లాలో ఉంటున్నాడు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM