Bigg Boss Himaja : బిగ్ బాస్ బ్యూటీ, తెలుగు నటి హిమజ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు తన అందం, అభినయంతో ఎంతో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది. ముందు యాంకర్‌గా, సీరియల్ ఆర్టిస్ట్‌గా అదరగొట్టిన హిమజ తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. ఈ షోలో బిగ్‌బాస్ టైటిల్ అందుకోకపోయినా.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అలా వచ్చిన క్రేజ్ తో పలు షోలలో దర్శనమిచ్చింది. ఇటీవల హిమజ సినిమాలలో కనిపిస్తుంది. మరోవైపు హిమజ ఖరీదైన కార్లు కొనడం, అలానే ఇళ్లు కొనడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
తాజాగా హిమజకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అయింది. హిమజ తన ఇంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు ఆరోపిస్తూ స్పెషల్ టీం పోలీసులు హిమజను అదుపులోకి తీసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. హైదరాబాద్ శివారులో ఉన్న ఇబ్రహీంపట్నం జిబి వెంచర్స్ లో ఒక ఇంటిపై దాడి చేసిన పోలీసులు.. కొంత మంది సెలబ్రిటీలను అదుపులోకి తీసుకున్నారని వారిలో హిమజ కూడా ఉందని ప్రచారం జరిగింది. హిమజ ఇచ్చిన పార్టీలో హేమ, నీలిమ, యాంకర్ ప్రవీణ, తేజు, పవిత్ర, రోహిణి వంటి వారు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగింది.
సౌండ్ సిస్టమ్ తో హడావిడి చేస్తుండటంతో స్థానికులు ఫిర్యాదు చేశారని… ఆక్రమంలోనే పోలీసులు దాడి చేసి మరీ 15 లీటర్ల మద్యం, సౌండ్ సిస్టమ్ సీజ్ చేసినట్లు చాలా వెబ్ సైట్లలో రాసుకు రాగా హిమజ స్పందించింది. కొత్త ఇంట్లో దీపావళి వేడుకల కోసం సన్నిహితులను పిలిచానని, పూజా కార్యక్రమాలు నిర్వహించానని హిమజ వెల్లడించారు. పోలీసులు వచ్చి ఏం జరుగుతోందని ఆరా తీశారని, వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారని, కానీ మీడియాలో మాత్రం ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాను అరెస్ట్ అయ్యానన్న వార్తలతో ఫోన్లు మీద ఫోన్లు వస్తున్నాయని, అందరికీ వాస్తవం ఏంటో తెలియాలనే ఇలా లైవ్ లోకి వచ్చానని వివరణ ఇచ్చారు. ఇటువంటి తప్పుడు వార్తలు ఎందుకు ప్రచారం చేస్తారో అందరికీ తెలిసిందేనని అన్నారు. వీటి గురించి మాట్లాడడం కూడా వృథా అంటూ హిమజ పేర్కొంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…