Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో గురువారం హౌజ్‌మేట్స్‌కి పలు టాస్క్‌లు ఇచ్చారు. అయితే టాస్కుల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచినవారికి ఓట్లు వేయమని అడిగేందుకు ఛాన్స్ ఇస్తారు. రీ క్రియేట్ టాస్క్‌తో పాటు నవ్వకుండా ఉండాల్సిన టాస్కులో శ్రీరామ్, మానస్ ఇద్దరూ గెలిచారు. ఇద్దరికీ టై అవడంతో శ్రీరామ్ మానస్‌కు ఛాన్స్ ఇచ్చాడు. అలా మానస్ మైకు ముందుకు వచ్చి.. తనకు ఓట్లేయండంటూనే తన ఫ్రెండ్స్ కాజల్, సన్నీకి కూడా ఓట్లేసి గెలిపించమని కోరుకున్నాడు.
అయితే మానస్ నేను మాట్లాడుకుని ఎవరు అడగాలో డిసైడ్ అవుతాం అని శ్రీరామ్ అనడంతో కాజల్ అభ్యంతరం చెప్పింది.. హౌస్ కాల్ తీసుకోమంటే.. మీ ఇద్దరూ మాట్లాడుకోవడం ఏంటని వాదించింది. దీంతో శ్రీరామ్ సీరియస్ అయ్యాడు. మాటలు లూజ్ అవుతున్నావ్ చూసుకో.. బ్రో అని కాజల్ అనడంతో.. బ్రో ఏంటి? బ్రో నువ్ నన్ను అలా పిలవకు అంటూ శ్రీరామ్ సీరియస్ అయ్యాడు. దీంతో సన్నీ కల్పించుకుని కాజల్‌ని తప్పుపట్టాడు.
ఇక వోట్ అప్పీల్ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ మూడో అవకాశం ఇచ్చాడు. ఇంటిసభ్యులందరూ సూపర్ స్టార్స్‌లా నటించాల్సి ఉంటుందన్నాడు. అందులో భాగంగా సన్నీ.. బాలయ్య, శ్రీరామ్.. చిరంజీవి, కాజల్.. శ్రీదేవి, మానస్.. పవన్ కల్యాణ్, షణ్ను.. సూర్య, సిరి.. జెనీలియాగా నటించారు. ప్రతి ఒక్కరూ వారివారి పాత్రల్లో జీవించేశారు. క్లాస్, మాస్ పాటలకు స్టెప్పులు కూడా ఇరగదీశారు.
ఇంతలో షణ్ను, సిరికి మధ్య మరోసారి తగవు మొదలైంది. నువ్వు వాళ్లతో(సన్నీ గ్రూప్‌తో) అయితే హ్యాపీగా ఉంటావు, వెళ్లు, నీతో నేను సింక్ అవ్వట్లేదు అని సిరికి ముఖం మీదే చెప్పాడు షణ్ను. ఎప్పుడూ లేనిది ఈ వారమే నీకు ప్రాబ్లం అవుతుంది కదా అంటూ సిరి అసహనం వ్యక్తం చేసింది. కాసేపటికే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ షణ్ను కోపాన్ని కరిగించింది. అతడు నవ్వేయగానే మన ఫ్రెండ్‌షిప్ అంటే చాలా ఇష్టమంటూ వెళ్లి అతడిని హత్తుకుంది.