Bhagavanth Kesari OTT : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకవైపు బుల్లితెరపై మరోవైపు వెండితెరపై సందడి చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి మూవీతో మంచి సక్సెస్‌ను అందుకున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ సినిమా చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా భారీగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో దాదాపు ఐదు వారాల పాటు సందడి చేసింది. ఇలా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడంతో పాటు లాభాలను కూడా సొంతం చేసుకుంది. తద్వారా బాలయ్యకు విజయాల హ్యాట్రిక్‌ను ఈ చిత్రం అందించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు వచ్చేశాయి.
ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు దక్కించుకోగా, ఈ చిత్రాన్ని థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని సమాచారం. గురువారం (నవంబర్ 23) అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది.దసరా సందర్భంగా అక్టోబర్ 19న రిలీజైన ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ ఏడాది మొదట్లో వీర సింహా రెడ్డి తర్వాత మరోసారి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన రెండో బాలయ్య బాబు సినిమాగా నిలిచింది.
.. బాలయ్య కెరీర్‌లోనే విభిన్నమైన కథాంశంతో రూపొందిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేసింది. అర్జున్ రాంపాల్ విలన్ రోల్‌ను పోషించాడు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్‌ను సాధించి కేక పెట్టించింది. ఇది కూడా బాలయ్య కెరీర్’లో అరుదైన రికార్డ్.. గా చెప్పోచ్చు. ఏజ్‌కు తగ్గ పాత్రలో నటిస్తూ.. మంచి కమర్షియల్ హిట్‌ను అందుకోవడం అదుర్స్ అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అంతేకాదు వరుసగా మూడు సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని హాట్రిక్ 50 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్న హీరోగా సంచలనం సృష్టించాడు బాలయ్య.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…