వాణీ జయరాం.. తెలుగు, తమిళతంతో పాటు పలు భాషలలో తన గానామృతంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులని గెలుచుకున్న గొప్ప సింగర్. ఓ నదిలా ఆమె పాటల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అయితే ఆమె గాయని అవుతుందని చిన్నప్పుడే జ్యోతిష్యుడు చెప్పాడట. కేవలం పది రోజుల చిన్నారిని చూసి ఆయన ప్రెడిక్ట్ చేయగా, అదే నిజమవ్వడం విశేషం. తన తల్లిదండ్రులకు వాణి జయరాం ఐదవ సంతానం కాగా, తాను పుట్టి పది రోజులే అవుతుందట. ఆ సమయంలో తన తల్లికి జ్వరం వచ్చిందట. ఇంకా తనకు నామకరణం చేయలేదు.
అయితే అప్పుడు ఏం పేరుపెట్టాలనేదానిపై తండ్రి తన పుట్టిన డేట్, టైమ్ తీసుకుని వెల్లూరులోని ఓ ఆస్ట్రోలజర్‌కి వద్దకి వెళ్లాడట. తన ఫాదర్ చెప్పిన డిటెయిల్స్ ని బట్టి ఆయన ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాడని వాణీ జయరాం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన జాతకం చూసి, ఈ బేబీ పెద్దయ్యాక పెద్ద సింగర్ అవుతుందని, అయితే అది విని తన ఫాదర్ నవ్వుకున్నాడని వాణీ అన్నారు.. అంతేకాదు తనకు `కలైవాణి` అనే పేరు కూడా పెట్టమన్నాడట. ఈ విషయం విని తన అమ్మకూడా నవ్వుకుందని, కానీ ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టు తనకు కలైవాణి అనే పేరు నామకరణం చేశారట.
అప్పుడు ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటే నిజమవ్వడం ఆశ్చర్యంగా ఉంది. అంతా ఆ దేవుడి దయ వల్లే జరిగిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది వాణి జయరాం. దాదాపు ఐదు దశాబ్దాలుగా గాయనీగా రాణిస్తున్న వాణి జయరాం అద్భుతమైన గాత్రానికి ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చిచేరాయి. ఇటీవల కేంద్రప్రభుత్వం `పద్మ భూషణ్` పురస్కారాన్ని ప్రకటించగా, ప్లే బ్యాక్ సింగర్‌గా మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. అందులో `శంకరాభరణం`, `స్వాతికిరణం`, తమిళంలో `అపూర్వ రాగంగల్` చిత్రాల్లోని పాటలకు ఉత్తమ గాయనీగా మూడు నేషనల్ అవార్డులు వరించాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…