Ariyana : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం కోసం ఐటమ్ భామగా మారిన విషయం తెలిసిందే. ఇందులో ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అనే పాటలో మాస్ డ్యాన్స్ చేయగా, ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ పాటలో సమంత గ్లామర్, చంద్రబోస్ లిరిక్స్ ఒక ఎత్తైతే, గాయని ఇంద్రావతి చౌహాన్ తన మత్తు వాయిస్‌తో పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది.
సమంత మాస్ సాంగ్ సామాన్యులతోపాటు సెలబ్స్‌ని సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. సౌత్ ఇండియన్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ వ్యూస్ రాబట్టిన పాటగా దుమ్మురేపుతోంది. ముఖ్యంగా సమంత స్టన్నింగ్ లుక్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఈ పాటకు బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ దక్కించుకున్న అరియానా తన దైన స్టైల్‌లో డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో అరియానా లుక్స్‌తోపాటు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి అందరూ ఫిదా అవుతున్నారు.
ఈ పాటలో మీ మగబుద్ధే వంకరబుద్ది.. అంటూ సాగే లిరిక్స్ మగవాళ్లను తప్పుగా చూపించేలా ఉన్నాయని.. ఈ పాటలోని లిరిక్స్ వల్ల పురుషులపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఉందంటూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం ఫిర్యాదు చేసింది. పుష్ప సినిమాతోపాటు.. ఈ పాటలో నటించిన సమంతపై కూడా పురుషుల సంఘం కేసు పెట్టింది. పాటపై నిషేధం విధించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది.. పురుషుల సంఘం.
https://www.instagram.com/reel/CXZB3-kgZN3/?utm_source=ig_embed&ig_rid=6c832285-3f2e-4974-995f-8944157232c0