Animal OTT Release Date : ప్రస్తుతం థియేటర్స్‌లో దుమ్ము రేపుతున్న చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, రష్మిక ప్రధాన పాత్రలుగా రూపొందిన యానిమల్ చిత్రం అన్ని భాషలలో దుమ్ము రేపుతుంది. యూత్ ఈ చిత్రానికి తెగ కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా ఇప్పటికే రూ. 500 కోట్ల కలెక్షన్స్ మార్క్ చేరుకుంది. మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే దిశగా ముందుకు వెళుతోంది. వెయ్యి కోట్లు ఈజీగా సాధిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. చిత్రంలో రణ్‌బీర్ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. యువత ఆయనకు జేజేలు పలుకుతున్నారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి కొద్ది రోజులుగా చర్చ నడుస్తుంది.
డిసెంబర్ 1న యానిమల్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. యానిమల్ సినిమా తొలిరోజే సంచలనం సృష్టించగా, ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కొత్త సినిమా రిలీజైన తర్వాత 45 నుంచి 60 రోజుల్లోనే సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతుంది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీని జనవరి 26న ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్టు సమాచారం. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో అదే రోజు నుంచి యానిమల్ స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు.. థియేటర్‌తో పోలిస్తే యానిమల్ మూవీ ఓటీటీ వెర్షన్ లెంగ్త్ ఇరవై నిమిషాల ఎక్కువగానే ఉండబోతున్నట్లు టాక్ నడుస్తుంది. నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్టు ప్రచారం జరుగుతుండగా, దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది.
ఇక యానిమల్ చిత్రంలో రణ్‌బీర్, రష్మికలతో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ, శక్త్ కపూర్‌లు కూడా సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. సూపర్ హిట్ మూవీ ‘యానిమల్’ను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.. కానీ ఇప్పుడు హిట్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ సినిమా ఇప్పటి వరకు ఇండియాలో దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…