Animal Movie Trailer : రణ్‌బీర్ కపూర్, రష్మిక ప్రధాన పాత్రలలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం యానిమల్. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్ ఆసక్తిని పెంచింది. మునుపెన్నడూ లేని విధంగా రణ్‌బీర్ కనిపించాడు. పాటలు కూడా మెప్పించాయి. ఈ సినిమా మొదటి నుంచి తండ్రి కొడుకుల బంధం నేపధ్యంలో వుంటుదని హిట్ ఇస్తూనే వున్నారు. ట్రైలర్ లో అది ఇంకా స్పష్టంగా చూపించారు. ట్రైలర్ కట్ లో హైప్ జోలికి పోలేదు సందీప్. సినిమాలో కీ పాయింట్ ఏమిటో అదే చూపించాడు. . రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ వేగం పెంచారు. అందులో భాగంగా కొంతసేపటి క్రితం ఈ సినిమా తెలుగు వెర్షన్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
యానిమల్ సినిమాలో హీరో చిన్నప్పటి నుంచి విపరీతమైన మానసిక స్థితిని కలిగినవాడిగా కనిపిస్తున్నాడు. ముందుగా తన తండ్రిని ద్వేషిస్తూ వెళ్లిన అతను .. ఆ తరువాత తండ్రి పట్ల ప్రేమతో తాను అనుకున్న పనులు చేయడం చూపించారు. టైటిల్ కి తగినట్టుగానే హీరో వ్యవహరించడం ట్రైలర్ లో కనిపిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు .. ఎమోషనల్ డ్రామా ప్రధానంగా ఈ ట్రైలర్ సాగింది. హీరో తండ్రిగా అనిల్ కపూర్ నటించగా, హీరో భార్య పాత్రలో రష్మిక కనిపిస్తోంది. ఇతర ముఖ్యమైన పాత్రలను బాబీ డియోల్ … శక్తి కపూర్ .. ప్రేమ్ చోప్రా .. సురేశ్ ఒబెరాయ్ పోషించారు. ఈ సినిమా నిడివి 3 గంటల 21 నిమిషాలు ఉందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత నిడివి కలిగిన సినిమా ఇదేనని అంటున్నారు.
చిత్ర ట్రైలర్‌లో రణ్‌బీర్ కపూర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించి సందడి చేశారు యానిమల్ ట్రైలర్ చూస్తుంటే ఇది మొత్తం తండ్రీ కొడుకుల చుట్టూ తిరిగే కథ అని స్పష్టమవుతోంది. ట్రైలర్ మొత్తం రణ్‌బీర్, అనిల్ కపూర్, రష్మిక, బాబీ డియోల్ చుట్టూనే తిరిగింది.ఈ ఏడాది ఆగస్ట్ 11న రిలీజ్ కావాల్సిన ఈ యానిమల్ మూవీ.. ఇప్పుడు డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. మొదట్లో ఈ సినిమాలో రష్మిక పాత్రకు పరిణీతి చోప్రాను అనుకున్నా.. తర్వాత ఆమె మరో సినిమా అంగీకరించడంతో యానిమల్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు పుష్ప 2 బ్యూటీ రష్మిక ఎలా సందడి చేయనుందనేది ఆసక్తకరంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…