Animal Movie Talk : కొన్ని చిత్రాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, వాటిని బ్యాన్ చేయాలని కొందరు ఎప్పటి నుండో యుద్ధం చేస్తూనే ఉన్నారు. పుష్ప సినిమా సమయంలోనే ఆ సినిమాని కొందరు ప్రముఖులు చాలా విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు యానిమల్ పై కూడా అదే టైపు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఛత్తీస్ గడ్ కు చెందిన ఎంపీ రంజిత్ రంజన్ రాజ్య సభ్యలో పుష్ప, యానిమల్, కబీర్ సింగ్ సినిమాల గురించి పలు అంశాలు లేవనెత్తారు.ఇవి ప్రస్తుతం చర్చకు దారి తీస్తున్నాయి.యానిమల్ సినిమా చూసి తన కూతురు ఏడ్చిందంటూ కాంగ్రెస్ ఎంపీ చెప్పుకొచ్చారు.
సినిమా అనేది సమాజానికి అద్దం మాదిరిగా ఉంటుంది, దానిని చూస్తూ మనం పెరిగాం. ఇది యువతని చాలా ప్రేరేపిస్తుంది. గతంలో వచ్చిన కబీర్ సింగ్, పుష్పలాంటి సినిమాలు ,ఇప్పుడు యానిమల్ సినిమాలు యువతపై చాలా ప్రభావం చూపిస్తాయి. రీసెంట్‌గా నా కూతురు తన ఫ్రెండ్స్ తో కలిసి యానిమల్ సినిమా చూడటానికి వెళ్లింది. మధ్యలోనే ఏడుస్తూ బయటకు వచ్చేసింది” అని రాజ్యసభలో ఆమె చెప్పారు. మహిళల పట్ల హింసను ప్రోత్సహించేలా ఈ సినిమా ఉందని ఆమె విమర్శించారు. “కబీర్ సింగ్ సినిమాలో ఉన్న వ్యక్తి తన భార్య, చుట్టు పక్కల మనుషులు, సమాజం పట్ల ఎలా వ్యవహరిస్తాడో చూసాం. దానిని యువత ఆదర్శగా తీసుకుంది. ఇలాంటి సినిమా వలన సమాజంలో హింస పెరిగిపోతుందని రంజీత్ రంజన్ అన్నారు.
యానిమల్ మూవీలో సిక్కుల యుద్ధ గీతం అర్జన్ వైలీని ఓ హింసాత్మక సీన్ కోసం వాడుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఆమె ప్రశ్నించారు. మొఘల్స్, బ్రిటీష్ తో పోరాడిన సిక్కు యోధుల వీరగాధను తెలిపే ఈ పాటను ఓ గ్యాంగ్ వార్ కోసం వాడుకోవడం వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విమర్శలు చేశారు. అయితే ఎంపీ కామెంట్స్‌ని కొందరు తప్పు పడుతున్నారు. సమాజంలో జరిగే చాలా విషయాలకు సినిమాలకు లింకులు పెడుతూ ఫిలిం మేకర్స్ ని బాధ్యులను చేయడం సరికాదని , మంచి చిత్రాలు తీసినప్పుడు ప్రోత్సహించే రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయని అడిగితే ఠక్కున సమాధానం రాదు అని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…